శ్రీదేవి సవతి తల్లి పాత్రలో ' మామ్ '
ఒకప్పుడు యావత్ భారతదేశాన్ని ఒక ఊపు ఊపేసింది అందాల తార శ్రీదేవి. తెలుగుతో పాటు, దక్షిణ భారత భాషల్లోనూ, అటు బాలీవుడ్ లోనూ మహారాణిగా రాజ్యమేలింది. పెళ్లైన తర్వాత, సినిమాలకు చాలాకాలం పాటు పూర్తిగా దూరమైపోయింది. ఇంగ్లీష్ వింగ్లీష్ తో సెకండ్ ఇన్నింగ్స్ మొదలెట్టిన శ్రీదేవి, ఆ సినిమా ఫలితం కాస్త అటూ ఇటూ ఉన్నా, తను మాత్రం మంచి మార్కులు తెచ్చుకోగలిగింది