Read more!

English | Telugu

అక్కినేని అఖిల్ గాయపడ్డాడా..?

హీరోగా తన మొదటి సినిమా అఖిల్ తో, టాలీవుడ్ కు మరో అందగాడు దొరకాడు అని ప్రశంసలు పొందాడు అక్కినేని అఖిల్. ఆ సినిమా పరంగా నిరాశపడినా, సిసిఎల్ 2016 లో మాత్రం అఖిల్ నిరాశ పరచలేదు. తన టీం ను ప్లేయర్ గా కెప్టెన్ గా సమర్ధవంతంగా నడిపి, కప్ ను చేజిక్కించుకున్నాడు. అయితే, ఈ టోర్నీ సమయంలో అఖిల్ ఎడమ చేతి కండరాలకు సమస్య వచ్చిందట. ఫ్రాక్చర్ కాకపోయినా, కండరాలు స్ట్రెయిన్ అయ్యాయని, కంప్లీట్ గా రెస్ట్ తీసుకుంటే త్వరగా కోలుకోవచ్చని డాక్టర్లు చెప్పడంతో, పూర్తిగా రెస్ట్ తీసుకుంటున్నాడు. ఇదే గ్యాప్ లో నాలుగైదు కథల సిట్టింగ్స్ కూడా ప్లాన్ చేశాడట. టాలీవుడ్ లో స్టార్ గా ఎస్టాబ్లిష్ అవ్వాలనేది అఖిల్ ప్లాన్. దీని కోసం కింగ్ నాగార్జున సపోర్ట్ కూడా తీసుకుంటున్నాడట. మరి తర్వాతి సినిమాకు ఎలాంటి కథను ఓకే చేస్తాడో చూడాలి..