Read more!

English | Telugu

చైతూ ప్రేమమ్ ఫస్ట్ లుక్

మళయాళంలో సూపర్ హిట్ అయిన ప్రేమమ్ ను తెలుగులో చైతూ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే గత కొన్నాళ్లుగా దానికి టైటిల్ పై ఊహాగానాలు సాగినా, చివరికి ప్రేమమ్  టైటిల్ నే చైతూ సినిమాకు కూడా కంటిన్యూ చేస్తున్నారు. దీనికి సంబంధించి మూవీ టీం, ప్రేమమ్ లో చైతూ ఫస్ట్ లుక్ ను విడుదల చేసింది. ప్రేమకథలకు ముగింపు ఉంటుంది కానీ అనుభూతులకు ఉండదు అనేది ఉపశీర్షిక. కార్తికేయ ఫేం చందు మొండేటి డైరెక్ట్ చేస్తున్న ప్రేమమ్ లో చైతూ శ్రుతిహాసన్, అనుపమ పరమేశ్వరన్, మడోన్నా సెబాస్టియన్లతో రొమాన్స్ చేయబోతున్నాడు.

స్కూల్ లైఫ్ నుంచి, కాలేజీ లైఫ్ అయి బయటికి వచ్చేవరకూ, హీరో జీవితంలో జరిగే ప్రేమకథలే ప్రేమమ్. సితార సినిమా పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే 50 శాతం వరకూ షూటింగ్ పూర్తి చేసుకున్న ప్రేమమ్, ఈ వేసవికి థియేటర్లలో సందడి చేయనుంది. మళయాళంలో ప్రేమమ్ కోసం, యూత్ కాలేజీలు ఎగ్గొట్టి మరీ థియేటర్లకు ఎగబడ్డారు. అక్కడ ఈ సినిమా 100 రోజులకు పైగా ఆడింది. మరి చైతూ ప్రేమమ్ ఇక్కడ ఏం చేయబోతోందో తెలియాలంటే వేసవి వరకూ ఎదురుచూడక తప్పదు..