Read more!

English | Telugu

నీర్జా సినిమా ముఖ్యమంత్రికి నచ్చిందట

బాలీవుడ్ కు ఇప్పుడు కాసులు రాలుస్తోంది బయోపిక్ జానర్. బయోపిక్ గా వచ్చిన ప్రతీ సినిమా సూపర్ హిట్ అవుతోంది. ఇప్పుడు నీర్జా భానోత్ జీవితకథ ఆధారంగా వచ్చిన నీర్జా సినిమాకు కూడా ఇలాంటి ఆదరణే లభిస్తోంది. 1986 సెప్టెంబర్ 5న ముంబై న్యూయార్క్ అమెరికా విమానంలో లిబియా ఉగ్రవాదుల నుంచి ఎంతో సాహసంతో, విమానంలో ఉన్న ప్రయాణికులందర్నీ రక్షించి, అందుకు తన ప్రాణాల్ని త్యాగం చేసింది ఎయిర్ హోస్టస్ నీర్జా. ఆమె కథతో తెరకెక్కిన నిర్జాలో, టైటిల్ రోల్ లో సోనమ్ కపూర్ అద్భుతంగా నటించిందని ప్రశంసలు దక్కుతున్నాయి. లేటెస్ట్ గా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కూడా సినిమాపై ప్రశంసల వర్షం కురిపించాడు. ఈ మధ్య కాలంలో నేను చూసిన బెస్ట్ సినిమా అంటూ ట్విట్టర్లో పొగిడేశాడు.

ప్రపంచవ్యాప్తంగా ఈరోజు రిలీజైన నీర్జా,భారీ హిట్ దిశగా దూసుకుపోతోంది. నీర్జా భానోత్ కథను ఉన్నది ఉన్నట్లుగా తెరకెక్కించడంలో డైరెక్టర్ రామ్ మధ్వానీ సక్సెస్ అయ్యాడంటూ బాలీవుడ్ కితాబిస్తోంది. దాదాపు బాలీవుడ్ రివ్యూయర్లందరూ ఈ సినిమాకు 4 పాయింట్లు ఇవ్వడం విశేషం.