Read more!

English | Telugu

దిల్ రాజు జడ్జిమెంట్ కు ఏమైంది..?

ఇండస్ట్రీలో చాలా తెలివైన ప్రొడ్యూసర్ గా దిల్ రాజుకు పేరుంది. అతని జడ్జిమెంట్ తప్పదని చాలా మంది నమ్మకం. అందుకే దిల్ రాజు డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నా, లేక ప్రొడ్యూస్ చేసినా, ఆ సినిమాలకు మాంచి క్రేజ్ వస్తుంది. సినిమాలో ఏదో ఉందిరా అని అందరూ అనుకునేలా ఉంటుంది. కానీ గత కొంత కాలంగా, దిల్ రాజు లెక్క ఘోరంగా తప్పుతోంది. సీతమ్మ వాకిట్లో సినిమా తర్వాత, ఈ సినిమా హిట్టెహే అని అనుకునే విధంగా దిల్ రాజుకు సినిమా పడలేదు. ఎవడు, కేరింత, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, ఇప్పుడు కృష్ణాష్టమి అన్నీ బోర్డర్ లైన్లో ఆగిపోతున్నాయి తప్ప, సూపర్ హిట్ అనే గీతను టచ్ చేయడానికి మాత్రం ఇబ్బంది పడుతున్నాయి..

ఒకానొక టైంలో వరస హిట్లతో, ఇండస్ట్రీలో తన మార్క్ ను స్పష్టంగా వేసిన దిల్ రాజు జడ్జిమెంట్ ఇప్పుడెందుకు రాంగ్ అవుతోంది. బహుశా ప్రేక్షకులు, రాజు థింకింగ్ పరిధిని దాటేశారా..? ఇల్లంతా పూల దండలు కట్టేసి, ఇరవై మంది క్యారెక్టర్ ఆర్టిస్టులను పెట్టేసి తీస్తున్న ఫ్యామిలీ సినిమాలు బోర్ కొట్టేశాయని సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, కృష్ణాష్టమి రిజల్ట్స్ తర్వాతైనా దిల్ రాజుకు తెలిసుండాలి. బడ్జెట్ చిన్నదైనా, మంచి కథతో తెరకెక్కితే ఆదరించడానికి మనోళ్లు ఎప్పుడూ రెడీగానే ఉంటారు. వినే ఓపిక ఉంటే కొత్త కథలు ఇచ్చే కుర్రాళ్లు కూడా చాలామందే ఉన్నారు. మరి దిల్ రాజు లెక్క మారుస్తాడా..? కొత్త జనరేషన్ తో ప్యాచ్ అప్ అవుతాడా..? చూద్దాం..