"మీరు తాత".. యాంకర్ రవికి పవన్ కూతురి షాక్!
పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ ల ముద్దుల కూతురు ఆద్య.. యాంకర్ రవిల మధ్య జరిగిన సంభాషణ అందరినీ నవ్విస్తోంది. కొన్నాళ్లుగా రేణు బుల్లితెరపై జడ్జ్ గా వ్యవహరిస్తోన్న సంగతి తెలిసిందే. జీతెలుగులో ప్రసారమవుతోన్న 'డ్రామా జూనియర్స్' షోకి సింగర్ సునీత, ఎస్వీ కృష్ణారెడ్డిలతో పాటు రేణు దేశాయ్ కూడా న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్నారు.