English | Telugu

బిగ్ బాస్ బ్యూటీ డాన్స్ వీడియో.. వైర‌ల్ చేస్తున్న ఫ్యాన్స్‌!

సోషల్ మీడియాలో దేత్తడి హారిక షేర్ చేసిన ఓ వీడియో వైరల్ అవుతోంది. పొట్టి దుస్తుల్లో అమ్మడు డాన్స్ చేస్తూ రెచ్చిపోయిన ఈ వీడియోను నెటిజన్లు తెగ షేర్ చేస్తున్నారు. తెలంగాణ యాసతో, బోల్డ్ మాటలతో షార్ట్ ఫిలిమ్స్ చేసి క్రేజ్ సంపాదించుకుంది హారిక. అప్పుడప్పుడు తన హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ తన ఫాలోయింగ్ మరింత పెంచుకుంటుంది. ఈ క్రమంలో ఆమె పోస్ట్ చేసిన డాన్స్ వీడియో చూసి అందరూ షాకవుతున్నారు.

కేవలం యూట్యూబ్ ఛానెల్ ద్వారా పాపులర్ అయిన కొందరు వ్యక్తుల్లో హారిక ఒకరని చెప్పాలి. 'దేత్తడి' అనే యూట్యూబ్ ఛానెల్ మొదలుపెట్టి డిఫరెంట్ వీడియోలు రిలీజ్ చేస్తూ సెన్సేషన్ క్రియేట్ చేసింది. అతి తక్కువ సమయంలోనే బాగా ఫేమస్ అయింది. ఈ ఫేమ్ కారణంగానే ఆమెకి బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్ గా పాల్గొనే ఛాన్స్ వచ్చింది. తన మేనరిజం, బాడీ లాంగ్వేజ్ తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి పాపులారిటీ సంపాదించుకుంది.

బిగ్ బాస్ ఫైనల్స్ వరకు చేరుకొని ఐదో స్థానంతో సరిపెట్టుకుంది. అప్పటినుండి సోషల్ మీడియాలో మరింత యాక్టివ్ గా ఉంటోంది. తన టాలెంట్ ను బయటపెడుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ క్రమంలో ఇటీవ‌ల‌ ఓ డాన్స్ వీడియోను పోస్ట్ చేసింది. ఇందులో పొట్టి బట్టలేసుకుని తన అందంతో ఎట్రాక్ట్ చేస్తోంది. అదిరిపోయే స్టెప్పులతో మెప్పించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.