English | Telugu

"మీరు తాత".. యాంక‌ర్ ర‌వికి ప‌వ‌న్ కూతురి షాక్‌!

పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ ల ముద్దుల కూతురు ఆద్య.. యాంకర్ రవిల మధ్య జరిగిన సంభాషణ అందరినీ నవ్విస్తోంది. కొన్నాళ్లుగా రేణు బుల్లితెరపై జడ్జ్ గా వ్యవహరిస్తోన్న సంగతి తెలిసిందే. జీతెలుగులో ప్రసారమవుతోన్న 'డ్రామా జూనియర్స్' షోకి సింగర్ సునీత, ఎస్వీ కృష్ణారెడ్డిలతో పాటు రేణు దేశాయ్ కూడా న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఈ షోకి ఆద్యను గెస్ట్ గా ఆహ్వానించారు.

మదర్స్ డే సందర్భంగా ఈ స్పెషల్ ఎపిసోడ్ ను డిజైన్ చేశారు. తాజాగా ఈ షోకి సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. ఈ క్రమంలో ఆద్యకు యాంకర్ రవి గ్రాండ్ వెల్కమ్ చెప్పగా.. కూతుర్ని స్టేజ్ పై చూసిన రేణు ఆద్య దగ్గరకు వెళ్లి ఆమెని హగ్ చేసుకుంది. ఈ ప్రోమోలో ఆద్యను బాగా హైలైట్ చేశారు. 'వకీల్ సాబ్' బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌ తో షోలోకి ఎంట్రీ ఇచ్చిన ఆద్య తనదైన మాటలతో ఆకట్టుకుంది. ఈ షోకి మరో జడ్జ్ అయిన సునీతతో కలిసి గొంతు కలిపి 'నీలి నీలి ఆకాశం' పాటను పాడింది ఆద్య.

ఆ తరువాత యాంకర్ రవి తన గురించి తనే ఇంట్రడక్షన్ ఇచ్చుకుంటూ.. "నా పేరు రవి నేను ఇక్కడ హోస్ట్ ను" అని చెప్పాడు. వెంటనే సునీత కలుగజేసుకొని.. "రవి మీ అమ్మను అక్కా అని పిలుస్తాడు. కాబట్టి నువ్ రవిని మామ అని పిలువు" అంటూ ఆద్యకు చెప్పింది. ర‌వి కూడా "ఒక్క‌సారి మావ‌య్యా అని పిలువ‌మ్మా?" అన‌డిగాడు. వెంటనే రియాక్ట్ అయిన ఆద్య.. "మీరు తాతా" అని కౌంటర్ ఇచ్చింది. దీంతో రవి షాక‌వుతూ ఆమెని అలాగే చూస్తుండిపోతే, మిగ‌తావారంతా ప‌డీ ప‌డీ న‌వ్వారు. ఈ ప్రోమో చూసిన నెటిజన్లు పవన్ కూతురు కదా.. ఆ మాత్రం చలాకీతనం ఉంటుందంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.