English | Telugu

బిగ్ బాస్ విన్న‌ర్ పెళ్లెప్పుడంటే...

బిగ్ బాస్ సీజన్ 4లో కంటెస్టెంట్ గా పాల్గొన్న నటుడు అభిజిత్ ఫైనల్స్ వరకు వెళ్లి.. విజేతగా ట్రోఫీ అందుకున్నారు. ఈ షోతో అభిజిత్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో లైవ్ లోకి వస్తూ అభిమానులతో ముచ్చటిస్తుంటాడు అభిజిత్. తాజాగా లైవ్ లోకి వచ్చిన అభిజిత్.. ప్రస్తుతం దేశంలో ఉన్న పరిస్థితి గురించి మాట్లాడాడు. రోజుకి నాలుగు లక్షల కేసులు వస్తున్నాయంటే మాట్లాడడానికే చాలా బాధగా ఉందని అన్నాడు.

ప్రపంచంలో మన దేశమే దారుణమైన స్థానంలో ఉందంటూ అభిజిత్ అన్నాడు. ఇలాంటి సమయంలో బయటకు వెళ్లకుండా ఉండడమే మంచిదని.. ఇప్పుడు ఎవరి ప్రాణాలు వారు కాపాడుకోవడమే ముఖ్యమని చెప్పాడు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో సేవలు అందిస్తోన్న డాక్టర్లు, వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులకు అభిజిత్ ధన్యవాదాలు తెలిపాడు. అనంతరం అభిజిత్ ను సినిమా, పెళ్లి వంటి విషయాల గురించి నెటిజన్లు ప్రశ్నించారు.

అప్పుడెప్పుడో మూడు ప్రాజెక్ట్ లు లైన్ లో ఉన్నాయని చెప్పిన అభిజిత్.. ఇప్పటివరకు వాటిని అధికారికంగా ప్రకటించలేదు. అయితే ఇప్పుడు ఇంట్లోనే ఉంటూ కొత్తవాటిని నేర్చుకుంటున్నానని.. ప్రస్తుతం స్పానిష్ లాంగ్వేజ్ నేర్చుకుంటున్నట్లు చెప్పాడు. అలానే స్క్రిప్ట్ లు వింటున్నానని.. ఇప్పుడే ఏం చెప్పలేనని అన్నాడు. పెళ్లెప్పుడు అని అడిగిన నెటిజన్ కు నవ్వుతూ.. ఇప్పుడప్పుడే ఉండదులే అంటూ బదులిచ్చాడు.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.