English | Telugu

టీవీ స్టార్స్ పెళ్లి.. పోలీస్ కేస్‌!

బాలీవుడ్ టెలివిజన్ రంగంలో పాపులర్ నటీనటులు సుగంధ మిశ్రా, సంకేత్ భోస్లే ఇటీవలే ఒకరినొకరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కోవిడ్ పరిస్థితుల కారణంగా వారిద్దరూ ఏప్రిల్ 26న సింపుల్ గా పెళ్లి చేసుకున్నారు. అయితే ఇప్పుడు వారిద్దరిపై పంజాబ్ ప్రభుత్వ అధికారులు కేసు నమోదు చేయడం హాట్ టాపిక్ గా మారింది. కరోనా వైరస్ ను నిర్మూలించడానికి పంజాబ్ ప్రభుత్వం విధించిన నిబంధనలను పట్టించుకోకుండా సుంగంధ, సంకేత్ వివాహమా చేసుకున్నారు.

దీంతో రూల్స్ అతిక్రమించినందుకు వీరిద్దరిపై కేసు నమోదు చేశారు పోలీసులు. అంతేకాకుండా పెళ్లి జరిగిన రిసార్ట్ ఓనర్లుపై కూడా కేసు నమోదు చేశారు. ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వం విధించిన ఆంక్షలను అతిక్రమించారనే ఆరోపణలతో ఐపీసీ సెక్షన్ 188 కింద కేసు నమోదు చేశారు. అలానే డిజాస్టర్ మేనేజ్మెంట్ చట్టాలను అతిక్రమించారని మరికొన్ని కేసులు నమోదు చేశారు.

అయితే ఈ కేసుకి సంబంధించి ఎవరినీ అరెస్ట్ చేయలేదని పోలీసులు వెల్లడించారు. పెళ్లికి సంబంధించి సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో ఆధారంగా కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. పెళ్లిలో ప్రభుత్వం విధించిన రూల్స్ కి వ్యతిరేకంగా ఎక్కువమంది పాల్గొన్నారని అధికారులు చెబుతున్నారు.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.