English | Telugu

'జబర్దస్త్' భజన.. మామూలుగా లేదుగా!

బుల్లితెరపై 'జబర్దస్త్' షోకి ప్రత్యేకమైన స్థానం ఉంది. తెలుగులో నెంబర్ వన్ కామెడీ షోగా దూసుకుపోతోంది. గత ఎనిమిదేళ్లుగా ప్రసారమవుతోన్న ఈ షోకి ప్రేక్షకాదరణ రోజురోజుకి పెరుగుతోంది. అయితే కొన్నిసార్లు మల్లెమాల, జబర్దస్త్ షోల మీద జనాల్లో వ్యతిరేకత వచ్చింది. ఆర్టిస్ట్ లను అగ్రిమెంట్ పేరుతో బంధిస్తున్నారని.. ముఖ్యంగా అవినాష్ విషయంలో మల్లెమాలపై నెగెటివిటీ క్రియేట్ అయింది. బిగ్ బాస్ షోకి వెళ్లడానికి అవినాష్ ని మల్లెమాల సంస్థ అనుమతించలేదని.. అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకోవడానికి పది లక్షల రూపాయలు కట్టించుకున్నారని అవినాష్ స్వయంగా బిగ్ బాస్ హౌస్ లో చెప్పాడు.

దీంతో 'జబర్దస్త్' షోపై నెగెటివ్ కామెంట్స్ వినిపించాయి. దీంతో మల్లెమాల సంస్థ 'జబర్దస్త్' ఇమేజ్ ని పెంచే పనిలో పడింది. స్పెషల్ ఈవెంట్స్ లో 'జబర్దస్త్' షో గొప్పదనం గురించి చెబుతున్నారు. నిజానికి ఈ షో చాలా మందికి లైఫ్ ఇచ్చింది. కానీ అందులో నియంతృత్వ పోకడలున్నాయంటూ విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. నాగబాబు సైతం 'జబర్దస్త్' షోని వదిలేస్తూ నెగెటివ్ కామెంట్స్ చేశారు. ఇదిలా ఉండగా.. వచ్చేవారం ప్రసారం కాబోతున్న ఎక్స్ ట్రా జబర్దస్త్ షోలో రాకింగ్ రాకేశ్‌.. బండ్ల గణేష్ అవతారమెత్తి 'జబర్దస్త్' పై తన భక్తిని చాటుకున్నాడు.

ఈ షో ఒక అద్భుతమని.. ఎందరికో జీవితాలను ప్రసాదించిందని తెగ పొగిడేశాడు. అనంతరం జడ్జ్ మనో.. "కొన్ని కోట్ల మంది ఈ షో వలన రిలాక్స్ అవుతున్నారనేది పచ్చి నిజం" అంటూ కామెంట్ చేశాడు. 'జబర్దస్త్ లేకపోతే ఇక్కడ ఎవరం ఉండేవాళ్లం కాదని' హైపర్ ఆది అన్నాడు. "ఈరోజు మాతో పాటు మా కుటుంబాలన్నీ హ్యాపీగా ఉన్నాయంటే కారణం జబర్దస్త్" అని సుధీర్ అన్నారు. ఇలా ఒక్కొక్కరు 'జబర్దస్త్'పై పాజిటివ్ కామెంట్స్ చేస్తుండగా.. 'కేజీఎఫ్' బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వేసి వారి మాటలను మరింత ఎలివేట్ చేసే ప్రయత్నం చేశారు.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.