English | Telugu

లాస్యను గ‌ట్టిగా కావ‌లించుకున్న‌ రవి!

బుల్లితెర మీద ఒకప్పుడు లాస్య, రవి తెగ హడావిడి చేసేవారు. వీళ్లది హిట్ పెయిర్ కావడంతో వరుసగా ఎన్నో షోలను హోస్ట్ చేసే ఛాన్స్ దక్కించుకున్నారు. ఆ తరువాత ఇద్దరి మధ్య గొడవలు జరగడం, విడిపోవడంతో ఎవరికి వారే అన్నట్లుగా మారిపోయారు. అలా దాదాపు ఐదేళ్లు గడిచిపోయాయి. గతేడాది లాస్య బిగ్ బాస్ షోలో పాల్గొంది. ఆ షో నుండి బయటకి వచ్చినప్పటి నుండి రవితో మళ్లీ క్లోజ్ అయింది.

వీరిద్దరూ కలిసి ఓ ఈవెంట్ ను హోస్ట్ చేశారు. ఇద్దరూ కలిసి ప్రోగ్రాం చేయడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయ్యారు. సంక్రాంతి ఈవెంట్ తో కలిసిన వీరు.. ఇప్పుడు మళ్లీ బిజీ పెయిర్ గా మారారు. ప్రస్తుతం రవి, లాస్య 'కామెడీ స్టార్స్' షోలో సందడి చేస్తున్నారు. బిగ్ బాస్ షో వలన లాస్యకు మళ్లీ మునుపటి క్రేజ్ వచ్చేసింది. అలా ఇప్పుడు లాస్య మరోసారి బుల్లితెరపై తన సత్తా చాటుతోంది. రవితో కలిసి ఒకప్పటి మ్యాజిక్ ను రీ క్రియేట్ చేస్తోంది. 'కామెడీ స్టార్స్' షోలో టాలీవుడ్ హిట్ సినిమాలను స్పూఫ్ లుగా చేస్తూ కామెడీ పండిస్తున్నారు.

ఇదివరకు 'ఉప్పెన', 'నరసింహా' వంటి సినిమాలను తమ స్టైల్ లోకి మార్చుకొని రవి, లాస్య చేసిన స్పూఫ్ లు బాగా వైరల్ అయ్యాయి. తాజాగా మరో స్పూఫ్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా' సినిమా స్పూఫ్ లో హీరోయిన్ త్రిష పాత్రలో లాస్య, సిద్ధార్థ్ గా రవి నటించారు. ఇక రవి ఎంట్రీ సీన్ లో లాస్యను వెనుక నుంచి గట్టిగా కావ‌లించుకున్నాడు. లాస్య తన డిఫరెంట్ మ్యానరిజంతో ఆకట్టుకుంది. ఈ సీన్‌కు అంద‌రూ చ‌ప్ప‌ట్లు చ‌రిచారు. ఈ వీడియోను సోష‌ల్ మీడియాలో ఫ్యాన్స్ వైర‌ల్ చేస్తున్నారు. మొత్తానికి లాస్య‌-ర‌వి జోడీ మరోసారి బుల్లితెరపై తమ కెమిస్ట్రీతో రచ్చ చేస్తోంది!

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.