English | Telugu

"అది గూండా రాజ్యంలా క‌నిపిస్తోంది".. నటి కస్తూరి ట్వీట్ వైరల్!

ఒకప్పటి హీరోయిన్, నేటి బుల్లితెర నటి కస్తూరి శంకర్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. సామాజిక అంశాలు, ప్రజలకు జరిగే అన్యాయాలపై ఎప్పటికప్పుడు స్పందిస్తుంటారు. రాజకీయ విశ్లేషణలు కూడా చేస్తుంటారు. స్వతహాగా లాయర్ కావడంతో అన్ని విషయాలపై సమగ్ర అవగాహనతో మాట్లాడుతుంటారు. కస్తూరి శంకర్ చేసే కామెంట్స్ ఒక్కోసారి వివాదాలకు దారి తీస్తుంటాయి.

తాజాగా కస్తూరి శంకర్ పశ్చిమ బెంగాల్ లో జరిగిన ఘటనపై స్పందించారు. బెంగాల్ లో ఎన్నికల తరువాత కూడా హింస యథేచ్ఛగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అక్కడ జరిగే గొడవలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పశ్చిమ మిడ్నాపూర్ లో కేంద్రమంత్రి మురళీధరన్ పర్యటన సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. కొందరు దుండగులు విదేశాంగశాఖ సహాయమంత్రి కాన్వాయ్ పై రాళ్లతో, కర్రలతో దాడి చేశారు.

ఈ ఘటనపై నటి కస్తూరి ఆగ్రహం వ్యక్తం చేసింది. కేంద్రమంత్రి పరిస్థితే ఇలా ఉంటే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటని ప్రశ్నించింది. ఆమె చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎంతోమంది సెక్యూరిటీతో వచ్చే కేంద్ర మంత్రికే ఇలా జరిగితే.. వారి కింద పని చేసే నాయకులు, పార్టీ కార్యకర్తల పరిస్థితేంటో ఊహించుకోలేకపోతున్నానని అన్నారు. వాళ్లు అసలు మనుషులేనా.. గూండా రాజ్యంలా కనిపిస్తోందంటూ కస్తూరి ఫైర్ అయింది. ప్రస్తుతం ఈమె 'గృహ‌ల‌క్ష్మి' అనే సీరియల్ లో నటిస్తోంది.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.