English | Telugu

ఆడి కారు, లగ్జరీ లైఫ్.. క్లారిటీ ఇచ్చిన 'జబర్దస్త్' కమెడియన్!

'జబర్దస్త్' షో ద్వారా చాలా మంది కమెడియన్స్ లైమ్ లైట్ లోకి వచ్చాయి. బుల్లితెరపైనే కాకుండా సినిమా అవకాశాలు కూడా అందుకుంటున్నారు. ముఖ్యంగా అమ్మాయిల గెటప్స్ వేస్తూ నవ్వించే కమెడియన్స్ కి మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. అయితే వీరిలో చాలా మంది ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఆర్థికంగా కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇదిలా ఉండగా.. హైపర్ ఆది టీమ్ లో లేడీ గెటప్ వేసే శాంతి స్వరూప్ కోట్లు సంపాదించాడని చాలా కాలంగా మీడియాలో వార్తలు వస్తున్నాయి. అతడొక ఆడి కారు కొన్నాడని టాక్. అయితే ఈ విషయాలపై శాంతి స్వరూప్ క్లారిటీ ఇచ్చాడు.

తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా హోమ్ టూర్ వీడియో చేసి అందులో తన ఆస్తుల విషయాల గురించి మొత్తం క్లారిటీగా చెప్పాడు. తను ప్రస్తుతం కృష్ణానగర్ లోని ఓ అద్దె ఇంట్లో ఉన్నట్లు చెప్పాడు. ఆ ఇంటి రెంట్ ఆరు వేల రూపాయలని.. ఒకే గదిలో ఉంటున్నట్లు చూపించాడు. తన హాల్, కిచెన్, బెడ్ రూమ్ అని ఒక రూమ్ లోనే అన్నీ ఎరేంజ్ చేసుకున్నట్లు చెప్పాడు. తనకొచ్చిన అవార్డులను చూపించాడు.

తనకు గొప్పగా బ్రతకాలనే ఆలోచన ఎప్పుడూ లేదని.. ఉన్న దాంట్లో సంతృప్తిగా ఉండడమే ఇష్టమని చెప్పాడు. తనకు ఎన్నో కోట్ల ఆస్తులున్నాయని, ఒక ఆడి కారు కూడా ఉందని వచ్చిన రూమర్స్ లో ఎలాంటి నిజం లేదని చెబుతూ.. తనకు ఒక్క స్కూటీ మాత్రం ఉందని చెప్పాడు. సంపాదించిన మొత్తంలో కొంత డబ్బుని ఇంటికి పంపించడం కంటే గొప్ప సంతోషం మరొకటి లేదని ఎమోషనల్ గా మాట్లాడాడు.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.