English | Telugu

బాల‌య్య‌ జోలికి వెళ్లకపోతేనే బెటర్!

బుల్లితెరపై రెండు ద‌శాబ్దాల నుంచి స్టార్ యాంకర్ గా రాణిస్తున్నారు సుమ. టీవీ షోలైనా, సినిమా ఈవెంట్స్ అయినా.. సుమ ఉండాల్సిందే. ఆమె డేట్స్ దొరకకపోతే అప్పుడు వేరే వాళ్లకు అవకాశాలు వస్తాయి. అంతగా తన సత్తా చాటుతున్నారు. ప్రస్తుతం ఈమె స్టార్ మా ఛానెల్ లో ప్రసారమవుతోన్న 'స్టార్ట్ మ్యూజిక్' అనే షోకు యాంకర్ గా వ్యవహరిస్తున్నారు. ఇతర భాషల్లో సక్సెస్ అయిన షోను ముందుగా ఝాన్సీ హోస్ట్ చేశారు. ఆ తరువాత శ్రీముఖి వచ్చింది. వీరిద్దరు యాంకరింగ్ చేసిన సమయంలో రాని టీఆర్పీ సుమ హోస్ట్ చేస్తున్నప్పటి నుండి వస్తోంది. దీంతో సుమతోనే షోని కంటిన్యూ చేస్తున్నారు.

తాజాగా ఈ షోకి సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. ఈ షోకి 'ఇంటింటి గృహలక్ష్మి', 'చెల్లెలి కాపురం' సీరియల్ నటులు గెస్టులుగా వచ్చారు. ముందుగా సుమ వాళ్లకు చిన్న మిర్రర్స్ ఇచ్చి ముద్దులు పెట్టమని చెప్పింది. ఆ తరువాత ముద్దులు మసకమసకగా ఉన్నాయేంటని ప్రశ్నించగా.. చీకట్లో ముద్దులు పెట్టామని సీరియల్ నటులు చెప్పుకొచ్చారు. ఆ తరువాత సీరియల్ నటులు స్కూల్ పిల్లలుగా మారి స్కిట్ చేయగా.. టీచర్ గా చేసిన సుమ.. మాస్క్ లు లేని స్టూడెంట్స్ ను చూస్తూ.. మీరు చెడ్డీలు వేసుకున్నా, వేసుకోకపోయినా మాస్క్ లు మాత్రం కచ్చితంగా వేసుకోవాలని అన్నారు.

ఆ తరువాత అటెండెన్స్ తీసుకుంటూ.. మొదట "పవన్ కళ్యాణ్ గారు" అనగా.. "ప్రజెంట్ మామ్" అన్నారు. ఆ తరువాత "బాలకృష్ణ గారు" అనగా.. "సినిమాకెళ్లాడు టీచర్" అని ఓ నటి చెబుతుంది. అప్పుడు సుమ "పోనీలే వెళితే వెళ్లారు.. మనం ఆయన జోలికి వెళ్లకపోతేనే బెటర్" అని కామెంట్స్ చేసింది. ఇదంతా కూడా ఎంతో ఫన్నీగా సాగింది. ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు ఈ షో ప్రసారం కానుంది.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.