English | Telugu

మ‌రింత ఆల‌స్యం కానున్న బిగ్ బాస్ 5?

తెలుగులో బిగ్గెస్ట్ రియాలిటీ షో 'బిగ్ బాస్'. ఇప్పటికే నాలుగు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో ఐదో సీజన్ కోసం సిద్ధమవుతోంది. అయితే ఈసారి బిగ్ బాస్ షో మరింత ఆలస్యం కానుందని సమాచారం. గతేడాది కరోనా కారణంగా సీజన్ 4 చాలా ఆలస్యంగా మొదలైంది. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకున్న బిగ్ బాస్ నిర్వాహకులు ఈ ఏడాది ముందుగానే బిగ్ బాస్ షోని మొదలుపెట్టాలనుకున్నారు. అయితే కరోనా సెకండ్ వేవ్ ఉదృతి నేపథ్యంలో జూన్‌లో మొదలవ్వాల్సిన ఈ షో ఇప్పుడు చెప్పిన టైమ్‌కి ప్రసారమయ్యే ఛాన్స్ లేదని అంటున్నారు.

అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ షోను ఆగస్టు నెల వరకు వాయిదా వేసినట్లు తెలుస్తోంది. కరోనా సెకండ్ వేవ్ ఈ షో వాయిదాకు ముఖ్య కారణంగా చెబుతున్నారు. నిజానికి ఇప్పటికే మహారాష్ట్ర, కేరళ సహా చాలా రాష్ట్రాల్లో లాక్ డౌన్ విధించారు. అన్ని ఇండస్ట్రీలలో షూటింగ్ లు ఆగిపోయాయి.

టీవీ షూటింగ్ లు జరుగుతున్నప్పటికీ రియాలిటీ షోల షూటింగ్ లను మాత్రం ఆపేయాల్సిన పరిస్థితి. ఇప్పటికే ఎన్టీఆర్ హోస్ట్ చేయాలనుకున్న 'ఎవరు మీలో కోటీశ్వరులు' షో కూడా ఆగిపోయింది. ఇదే కోవలో బిగ్ బాస్ సీజన్ 5 కూడా వాయిదా పడింది. ఈసారి కూడా నాగార్జునే హోస్ట్ గా వ్యవహరించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.