English | Telugu

డబ్బిచ్చి గుడి కట్టించుకుంటున్న హన్సిక

హన్సిక డబ్బిచ్చి గుడి కట్టించుకుంటున్నదని తమిళ పత్రికలు ఘోష పెడుతున్నాయి. తఏలుగులో పూరీ జగన్నాథ్దర్శకత్వంలో అల్లు అర్జున్‍ హీరోగా నటించిన "దేశముదురు" చిత్రంతో సినీ పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయమైన హన్సిక ఆ తర్వాత కొన్ని తెలుగు చిత్రాల్లో నటించి తమిళ పరిశ్రమకు వెళ్ళింది. అక్కడ ఆమెకు అభిమానులు బాగానే తయారయ్యారు. అయితే వారి అభిమానం హన్సికకు గుడి కట్టేస్థాయిలో లేదని తమిళ మీడియా వాదన. ఎందుకంటే తమిళంలో ఆమెకు సూపర్ హిట్లేమీ లేవు. అయినా ఆమె నటనకు మంచి పేరే వచ్చింది. హన్సిక అభిమానులు ఆమెకు పబ్లిగ్గా పాలాభిషేకం చేస్తామన్నారు కూడా.

మియామీలో రామ్ చరణ్ హాలిడే

మియామీలో రామ్ చరణ్ హాలిడే ఎంజాయ్ చేయబోతున్నాడు. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఫ్లోరిడాలో ఉన్న మియామీ బీచ్ లో యువ హీరో రామ్ చరణ్ కొన్నాళ్ళు విశ్రాంతి తీసుకోవటానికి వెళ్తున్నాడని విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం. రామ్ చరణ్ ఇటీవల నటించిన "ఆరెంజ్" ఆశించిన స్థాయిలో విజయం సాధించక పోవటంతో రామ్ చరణ్ ని కొన్నాళ్ళు వేరే ఏదైనా ప్రదేశానికి వెళ్ళి రీఛార్జ్ అవ్వవలసిందిగా, రామ్ చరణ్ తండ్రి మెగాస్టార్ చిరంజీవి సలహా ఇచ్చినట్లు తెలిసింది. బావ అల్లు అర్జున్ మరికొందరు స్నేహితుల సలహా మేరకు రామ్ చరణ్‍ అమెరికాలోని ఫ్లోరిడాలో కల విలాసవంతమైన మియామీ బీచ్ కి ఒక నెల పాటు విశ్రాంతి తీసుకోవటానికి బయలుదేరుతున్నారట.

అల్లు అర్జున్ కి మెగా ఫ్యామిలీ మెగా గిఫ్ట్ లు

అల్లు అర్జున్ కి మెగా ఫ్యామిలీ మెగా గిఫ్ట్ లు ఇచ్చింది. అల్లు అర్జున్ కి మెగా ఫ్యామిలీ మెగా గిఫ్ట్ లు గా ఏమిచ్చిందంటారా...? యువ హీరో రామ్ చరణ్ తన బావ అల్లు అర్జున్ మ్యారేజ్ కి యూరప్ నుండి ఒక కాస్ట్ లీ స్యూట్ తెప్పించాడు. దాని ఖరీదు మూడున్నర లక్షలు. అల్లు అర్జున్ మ్యారేజ్ కి మెగాస్టార్ చిరంజీవి కూడా మెగా గిఫ్ట్ అందించారు. అల్లు అర్జున్ మ్యారేజ్ కి మెగా స్టార్ ఇచ్చిన మెగాగిఫ్ట్ ఏమిటంటే కార్టియర్ కపుల్ అనే కాస్ట్ లీ వాచ్ ని బహుమతిగా అందించారు. ఈ వాచ్ చాలా తక్కువగా అంటే ఓ పది వాచీలు మాత్రమే ఆ కంపెనీ లాంచింగ్ కోసం తయారుచేసింది.