English | Telugu
అల్లు అర్జున్ పెళ్ళికి కట్నం ఎంత...?
Updated : Mar 7, 2011
వరకట్నం తీసుకోవటం దురాచారం. కట్నం తీసుకున్నవాడు గాడిద అని మనం సామాన్యంగా అంటూ ఉంటాం. టి.వి.ల్లో, పేపర్లలో ఈ విషయాన్ని మన నాయకులు కూడా చెపుతూ ఉంటారు. కానీ అవన్నీ అంతవరకే పరిమితం. కట్నం లేకుండా పెళ్ళి చేసుకునే కుర్రాడు ఇంతవరకూ చాలా అరుదుగా మాత్రమే కనపడుతూ ఉంటారు. కానీ ప్రముఖ యువ హీరో అల్లు అర్జున్ ని అతని కాబోయే మామ "బాబూ నీకు కట్నం ఏం ఇమ్మంటావ్" అని అడగ్గా దానికి అల్లు అర్జున్ " దయచేసి కట్నం ప్రసక్తి తీసుకురాకండి. నాకు కానీ కట్నం కూడా అక్కర్లేదు" అని అన్నాడట.
అల్లు అర్జున్ ఇలా అంటే అతని తండ్రి ప్రముఖ నిర్మాత అయిన అల్లు అరవింద్ మాత్రం "చూడండి బావగారూ. మా అర్జున్ కి అమ్మాయి నచ్చింది. అమ్మాయికి మా అబ్బాయి నచ్చాడు. వాళ్ళిద్దరూ ఒకరిని ఒకరి ఇష్టపడ్డారు.ప్రేమించుకున్నారు. సినిమాలు తీసి నేను, హీరోగా నటిస్తూ మా అబ్బాయి బాగానే సంపాదించుకుంటున్నాము. వాళ్ళిద్దరూ సుఖంగా, సంతోషంగా ఉంటే నాకంతే చాలు. మాకు కట్న కానుకలు అవసరం లేదు.దయచేసి కట్నం ప్రసక్తి ఇంకెప్పుడూ తీసుకురాకండి" అని అన్నారట.