English | Telugu

రాజమౌళి "ఈగ"తమిళ రీమేక్ 5కోట్లు...?

రాజమౌళి "ఈగ"తమిళ రీమేక్ రైట్స్ కోసం 5 కోట్లు భారీ ఆఫర్ లభించిందని సమాచారం. అసలు రాజమౌళి ఏ సినిమా చేసినా ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. రాజమౌళి ప్రస్తుతం దర్శకత్వం వహిస్తున్న "ఈగ" చిత్రం కూడా అలాగే సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. రాజమౌళి చేస్తున్నఈ "ఈగ" చిత్రానికి తమిళ రీమేక్ కోసం ఒక పెద్ద నిర్మాత అయిదు కోట్లు ఆఫర్ చేసినట్లు సమాచారం. దానికి కారణం రాజమౌళి "మగధీర" తమిళంలో కూడా సూపర్ హిట్టయింది. రాజమౌళి "మగధీర" ప్రభావం "ఈగ" చిత్రం మీద పడింది.

"ఈగ" చిత్రంలో హీరో, హీరోయిన్లతో సంబంధం లేకుండా కేవలం రాజమౌళి పేరు చూసి మాత్రమే "ఈగ" చిత్రానికి తమిళ రీమేక్ కోసం అయిదు కోట్ల భారీ మొత్తాన్ని ఆ నిర్మాత రాజమౌళికి ఆఫర్ చేసినట్లు సమాచారం. రాజమౌళి "ఈగ" చిత్రంలో నాని హీరోగా, సమంత హీరోయిన్ గా, సుదీప్ విలన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ "ఈగ" చిత్రంలో రాజమౌళి గ్రాఫిక్స్ తో అద్భుతాలు చేయనున్నట్లు సమాచారం. రాజమౌళి "ఈగ" చిత్రం బహుశా అక్టోబర్ దసరా పండక్కి విడుదల చేయవచ్చు.