English | Telugu
గోవాలో నానితో శృతి.. మరీ ఇంత సీక్రెటా!
Updated : Sep 13, 2023
ఈ ఏడాది 'దసరా'తో బ్లాక్ బస్టర్ అందుకున్న నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం 'హాయ్ నాన్న' అనే సినిమా చేస్తున్నాడు. నూతన దర్శకుడు శౌర్యవ్ దర్శకత్వంలో వైరా ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా మృణాల్ ఠాకూర్ నటిస్తుండగా, నాని కూతురి పాత్రలో బేబీ కియారా ఖన్నా నటిస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో శృతిహాసన్ ప్రత్యేక పాత్రలో నటిస్తుండటం విశేషం.
'హాయ్ నాన్న'లో శృతిహాసన్ నటిస్తున్నట్లు ఇప్పటిదాకా అధికారిక ప్రకటన రాలేదు. కానీ శృతి సైలెంట్ గా 'హాయ్ నాన్న' షూటింగ్ లో పాల్గొన్నట్లు ఎప్పుడో వార్తలు వచ్చాయి. ఈ వేసవిలో గోవాలో జరిగిన కీలక షెడ్యూల్ లో నానితో కలిసి శృతి షూట్ లో పాల్గొందని సమాచారం. సినిమాకి కీలకమైన నాని భార్య పాత్రలో శృతి కనిపించనుందట. కాగా నాని-శృతి కలయికలో ఇదే మొదటి సినిమా కావడం విశేషం.
'హాయ్ నాన్న' సినిమా డిసెంబర్ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రచార కార్యక్రమాలు కూడా మొదలవుతున్నాయి. అయినప్పటికీ శృతి రోల్ గురించి ఎలాంటి అనౌన్స్ మెంట్ రాకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇందులో శృతి కీలక పాత్ర పోషిస్తోంది,ఎప్పుడో షూటింగ్ లో కూడా పాల్గొంది. అయినప్పటికీ ఈ విషయాన్ని మరీ ఇంత సీక్రెట్ గా ఎందుకు ఉంచుతున్నారు? అనేది అర్థంకావడం లేదు.
ప్రస్తుతం తెలుగులో శృతి లక్కీ హీరోయిన్ లా మారిపోయింది. ఈ ఏడాది ఇప్పటికే 'వీరసింహారెడ్డి', 'వాల్తేరు వీరయ్య' రూపంలో రెండు విజయాలు అందుకుంది. 'హాయ్ నాన్న', 'సలార్'తో ఆ విజయ పరంపర కొనసాగిస్తుందేమో చూడాలి.