English | Telugu
‘బోరింగ్ పాప’ ఎందుకు ‘వ్యాంప్’గా స్థిరపడాల్సి వచ్చింది?
Updated : Sep 14, 2023
పేరుకి పదహారణాల తెలుగమ్మాయి. క్లాసికల్ డాన్సర్, వెయ్యికిపైగా నృత్య ప్రదర్శనలు, మంచి హీరోయిన్‌గా పేరు తెచ్చుకోవాలన్న లక్ష్యం. కానీ, అనుకున్నామని జరగవు అన్నీ, అనుకోలేదని ఆగవు కొన్ని... అన్నట్టుగా ఆమె అనుకున్నదొకటి, ప్రాప్తించింది మరొకటి. హీరోయిన్ అవ్వాలని కలలు కన్న ఆమె వ్యాంప్‌గా, రొమాంటిక్ సినిమాలు చేసే అమ్మాయిగా పేరు తెచ్చుకోవాల్సి వచ్చింది. కేవలం కుటుంబ భారం తనపై పడడం వల్లే ఆ పని చెయ్యాల్సి వచ్చిందట. ఆమె ఎవరో కాదు, తెలుగు ప్రేక్షకులు ‘బోరింగ్ పాప’ అని ముద్దుగా పిలుచుకునే జయలలిత.
చిన్నతనంలోనే డాన్స్‌లో శిక్షణ తీసుకున్న ఆమె తన అక్కతో కలిసి వెయ్యికి పైగా కూచిపూడి నృత్య ప్రదర్శనలిచ్చింది. అంతేకాదు, థమ్స్ అప్ నిర్వహించిన అందాల పోటీలో థమ్స్ అప్ సుందరిగా నిలిచింది. తను నృత్య ప్రదర్శనలు ఇచ్చే రోజుల్లో ఎంతో మంది ఐఎఎస్, ఐపిఎస్ అధికారులు తనను పెళ్ళి చేసుకుంటామని తన తండ్రిని అడిగేవారని, తన తండ్రి మాత్రం తనను డాన్సర్‌గానో, హీరోయిన్‌గానో చేస్తానని, ఇప్పట్లో పెళ్ళి చేయనని వారికి చెప్పేవాడని చెప్పింది జయలలిత. అయితే మలయాళంలో వ్యాంప్‌గా నటించడం ఆమెకు గుర్తింపు రావడంతో తెలుగులోనూ అదే తరహా క్యారెక్టర్లు చేస్తూ వ్యాంప్‌గానే స్థిరపడిపోయింది. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా, కమెడియన్‌గా కూడా నటించిన జయలలిత ఆమె అనుకున్న గోల్‌ను మాత్రం రీచ్ అవ్వలేకపోయింది.