English | Telugu

ప్రభాస్ ఫ్యాన్స్ కి షాక్.. ఈ ఏడాది 'సలార్' విడుదల లేనట్టే!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో హోంబలే ఫిలిమ్స్ నిర్మిస్తున్న బిగ్గెస్ట్ యాక్షన్ ఫిల్మ్ 'సలార్'. ఈ సినిమా మొదటిభాగం 'సీజ్‌ ఫైర్‌' ఈ సెప్టెంబర్ 28న విడుదల కావాల్సి ఉండగా, సీజీ వర్క్ పట్ల దర్శకుడు సంతృప్తిగా లేకపోవడంతో వాయిదా పడింది. కొత్త విడుదల తేదీపై మేకర్స్ ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. నవంబర్ లేదా డిసెంబర్ లో విడుదలయ్యే అవకాశముందని వార్తలొస్తున్నాయి. అయితే అసలు ఈ సినిమా ఈ ఏడాది విడుదల కావడం కష్టమేనని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్నమాట.

సలార్ రిలీజ్ డేట్ పై ఇంకా మేకర్స్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదట. విడుదల ఆలస్యమైనా పరవాలేదు కానీ.. సీజీ వర్క్ మొత్తం పూర్తయ్యాక, దాని పట్ల పూర్తి సంతృప్తిగా ఉంటే అప్పుడు విడుదల తేదీపై నిర్ణయం తీసుకోవాలని చూస్తున్నారట. మూవీ టీం తీరుని బట్టి చూస్తే నవంబర్ లేదా డిసెంబర్ లో విడుదల చేయాలనే తొందర ఏమాత్రం లేనట్టు కనిపిస్తోంది. పైగా డిస్ట్రిబ్యూటర్స్ కూడా 2024, సంక్రాంతికి విడుదల చేస్తే బాగుంటుందని సూచిస్తున్నారట. అయితే సంక్రాంతికైనా వస్తుందా లేక మరింత ఆలస్యమవుతుందా అనేది సీజీ వర్క్ మీద ఆధారపడి ఉందంటున్నారు.

'సలార్'పై ప్రభాస్ ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. 'బాహుబలి-2' తర్వాత ఆస్థాయి సంచలనాలు సృష్టించగల సినిమా ఇదని ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు. అందుకే 'సలార్' ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ ఏడాది విడుదల కాకపోవచ్చు అనే వార్త ఫ్యాన్స్ ని కాస్త నిరాశ కలిగించేదే అయినప్పటికీ.. సంక్రాంతి సీజన్ కి వస్తే మాత్రం వారి ఆనందానికి అవధులుండవు. మామూలుగానే సంక్రాంతి సీజన్ లో సినిమాలకు వసూళ్ల వర్షం కురుస్తుంది. ఇక సలార్ లాంటి సినిమా అయితే కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది అనడంలో సందేహం లేదు.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.