English | Telugu
'ఖుషి' ఓటీటీకి వేళాయే.. కాకపోతే చిన్న ట్విస్ట్.. !
Updated : Sep 14, 2023
విజయ్ దేవరకొండ, సమంత కాంబినేషన్ లో శివ నిర్వాణ రూపొందించిన చిత్రం 'ఖుషి'. సెప్టెంబర్ 1న థియేటర్స్ లోకి వచ్చిన ఈ సినిమా.. ఓపెనింగ్స్ బాగానే రాబట్టింది. అయితే, ఆ తరువాత మాత్రం అంతగా ప్రభావం చూపలేకపోయింది. మ్యూజికల్ గా సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ సినిమా.. కుటుంబ ప్రేక్షకులను ఓ మాదిరిగా ఆకట్టుకుందనే చెప్పాలి.
ఇదిలా ఉంటే, ఖుషి ఓటీటీ స్ట్రీమింగ్ రైట్స్ ని నెట్ ఫ్లిక్స్ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. థియేట్రికల్ రన్ ముగింపు దశకు చేరుకున్న నేపథ్యంలో.. త్వరలోనే ఓటీటీ లో ప్రదర్శించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కుదిరితే సెప్టెంబర్ 30న లేదంటే అక్టోబర్ 4న ఖుషిని స్ట్రీమ్ చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. త్వరలోనే ఖుషి ఓటీటీ రిలీజ్ డేట్ పై పూర్తి స్పష్టత వచ్చే అవకాశముంది.
కాగా, ఖుషికి హేషమ్ అబ్దుల్ వహబ్ సంగీతమందించగా.. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది.