English | Telugu
ఇది రెబల్ స్టార్ రేంజ్.. రిలీజ్ కి ముందే 'సలార్'తో సెన్సేషన్!
Updated : Sep 13, 2023
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో హోంబలే ఫిలిమ్స్ నిర్మిస్తున్న బిగ్గెస్ట్ యాక్షన్ ఫిల్మ్ 'సలార్'. ఈ సినిమా మొదటిభాగం 'సీజ్ ఫైర్' ఈ సెప్టెంబర్ 28 న విడుదల కావాల్సి ఉండగా, వాయిదా పడింది. నవంబర్ లేదా డిసెంబర్ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా విడుదలకు ముందే సంచలనాలు సృష్టిస్తోంది.
'బాహుబలి-2'తో ప్రభాస్, 'కేజీఎఫ్-2'తో ప్రశాంత్ నీల్ ఎంతటి సంచలనాలు సృష్టించారో తెలిసిందే. 'బాహుబలి-2' వరల్డ్ వైడ్ గా రూ.1800 కోట్ల గ్రాస్ వసూలు చేస్తే, 'కేజీఎఫ్-2' రూ.1200 కోట్ల గ్రాస్ రాబట్టింది. అందుకే వీరి కాంబినేషన్ లో వస్తున్న 'సలార్'పై భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్టుగానే ఈ మూవీ బిజినెస్ భారీ స్థాయిలో జరుగుతోంది. నాన్-థియేట్రికల్ రైట్స్ రూపంలో ఏకంగా రూ.350 కోట్లు వచ్చినట్లు సమాచారం. డిజిటల్ రైట్స్ ని రికార్డు ధరకు నెట్ ఫ్లిక్స్ దక్కించుకోగా, శాటిలైట్ రైట్స్ ని భారీ ధరకు స్టార్ దక్కించుకుందట. ఇలా డిజిటల్, శాటిలైట్, ఆడియో రైట్స్ కలిపి నాన్-థియేట్రికల్ రైట్స్ రూపంలోనే రూ.350 కోట్లు వచ్చినట్లు తెలుస్తోంది. థియేట్రికల్ బిజినెస్ రికార్డు స్థాయిలో జరిగే అవకాశముంది. విడుదల తర్వాత ఈ సినిమా ఇంకెలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.