English | Telugu

మహేష్ ని ఇరకాటంలో పెట్టిన రాజమౌళి 


తెలుగు చలన చిత్ర పరిశ్రమకి దొరికిన అద్భుతమైన నటుడు మహేష్ బాబు. కృష్ణ వారసుడిగా సినీ రంగ ప్రవేశం చేసి తండ్రి కృష్ణ ఇమేజ్ నే తలదన్నేలా అతితక్కువ కాలం లోనే నెంబర్ వన్ హీరోగా ఎదిగిన సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం గుంటూరు కారం అనే మూవీ ని చేస్తున్నాడు. వచ్చే సంక్రాంతికి మూవీ విడుదల కాబోతుంది. శరవేగంగా జరుగుతున్న ఆ మూవీ షూటింగ్ లో మహేష్ రెగ్యులర్గా పాల్గొంటున్నాడు. ఇప్పుడు తాజాగా మహేష్ బాబు పిక్ ఒకటి బయటకి వచ్చి
నెట్టింట రికార్డ్స్ సృష్టిస్తుంది.

ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే పండుగాడు అనే డైలాగ్ కి తగినట్లు ఎవడి సినిమా రిలీజ్ అయ్యి రికార్డు లు బద్దలు కొడుతుంది అని ఎవరినైనా అడిగితే అందరూ ఒకేసారి మహేష్ బాబు సినిమా అని అంటారు. మహేష్ బాబు రూపం ఎంత అందంగా ఉంటుందో మహేష్ బాబు నటన కూడా అంతే అందంగా ఉంటుంది. ఎక్కడ ఓవర్ యాక్టింగ్ చెయ్యకుండా సెటల్డ్ పెరఫార్మెన్సు చెయ్యడం మహేష్ స్టైల్. ఆయన నుండి వచ్చే ప్రతి సినిమాని అయన అభిమానులు ఎలా అయితే మిస్ అవ్వకుండా చూస్తారో సినిమా ప్రేక్షకులు కూడా అంతే మిస్ అవ్వకుండా చూస్తారు. కొన్ని లక్షల మంది అభిమాన సంఘాలు మహేష్ బాబు కి ఉన్నాయి. సామజిక సేవ చేయడంలోనూ మహేష్ ముందు వరుసలో ఉంటారు. అలాగే ఎప్పుడు ఎలాంటి వివాదాల జోలికి కూడా వెళ్ళడు.
ఇక అసలు విషయం లోకి వస్తే మహేష్ తాజాగా ఒక జిమ్ లో అవుట్ పుట్స్ చేస్తున్న ఒక వీడియో బయటకి వచ్చింది. బీస్ట్ మోడ్ మరియు మాములు మోడ్ లో కనిపిస్తున్న ఆ పిక్ లో మహేష్ భారీగానే ఎక్సరసైజ్ లు చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. అలాగే పిక్ లో తన కండలు చాలా స్పష్టం గా కనపడుతున్నాయి. అలాగే హెయిర్ స్టైల్ కూడా సూపర్ గా ఉంది. యమ దొంగ సినిమాతో ఎన్టీఆర్ లుక్ ని,బాడీని పూర్తిగా మార్చిన రాజమౌళి ఇప్పుడు మహేష్ తో చెయ్యబోయ్యే సినిమా కోసం మహేష్ లుక్ ని కూడా పూర్తిగా మార్చే పనిలో రాజమౌళి ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆ మూవీ కోసమే మహేష్ జిమ్ లో కసరత్తులు చేస్తున్నాటుగా ఉంది. మహేష్ తన నెక్స్ట్ సినిమా రాజమౌళి దర్శకత్వంలో చేస్తున్నాడనే విషయం అందరికి తెలిసిందే

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.