English | Telugu
ఈ నెల 27న ఓటిటి లోకి స్కంద ?
Updated : Oct 12, 2023
అరేబియన్ గుర్రం ఎంత వేగంతో అయితే ముందుకు దోసుకుపోతుందో అంతే వేగంతో ఆ హీరో
కూడా అంతే వేగంతో నటనలోను,డాన్సులోను ముందుకు దూసుకుపోతాడు. తన మొదటి సినిమా నుంచే ఆ వేగాన్ని అందుకున్న హీరో ఎవరో కాదు రామ్ పోతినేని. దేవదాస్ సినిమా నుంచి నేటి స్కంద మూవీ వరకు రామ్ తన నటనతో ఎంతో మంది అభిమానులని సంపాదించుకున్నాడు. లేటెస్ట్ గా విడుదలయ్యి ఘన విజయం సాధించిన స్కంద మూవీ గురించి తాజాగా వచ్చిన ఒక వార్త రామ్ అభిమానులని ఆనందంలో ముంచెత్తుతుంది.
బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ పోతినేని తన నట విశ్వరూపాన్ని ప్రదర్శించిన మూవీ స్కంద. ఈ మూవీ గత నెల 28 వ తారీఖున ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయ్యి సంచలన విజయాన్ని సాధించింది. రామ్ కెరీర్ లోనే భారీ వ్యయంతో నిర్మాణమయిన ఈ మూవీ లో రామ్ నటనకి మంచి మార్కులు పడ్డాయి. అనేక కేంద్రాల్లో రికార్డు స్థాయి కలెక్షన్స్ ని కూడా సాధించింది. రెండు రాష్ట్రాలకి చెందిన ముఖ్యమంత్రులు అన్యాయంగా ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ ని తమ స్వార్ధం కోసం జైలుకు పంపిస్తారు. దాంతో ఆ బిజినెస్ మాన్ ఫ్రెండ్ కొడుకైన రామ్ పోతినేని ఆ ఇద్దరి సీఎం ల అంతు ఎలా చూసాడు అనేదే స్కంద కథ. ఈ మూవీ లో శ్రీ లీల,సాయి మంజ్రేకర్, ఒకప్పటి హీరోయిన్ ఇంద్రజ తో పాటు మైటీ స్టార్ శ్రీకాంత్ అండ్ ప్రిన్స్ లు నటించారు. థమన్ ఈ సినిమా కి సంగీతాన్ని అందించగా శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస్ చిట్టూరి ఈ సినిమా ని నిర్మించారు.
ఇక అసలు విషయానికి వస్తే. స్కంద మూవీ అతి త్వరలో ఓటిటి ప్లాట్ ఫార్మ్ లో విడుదల కావడానికి ముహూర్తం రెడీ అయ్యిందనే వార్తలు వస్తున్నాయి. సినిమా విడుదలకి ముందే చేసుకున్న ఒప్పొందం ప్రకారం స్కంద మూవీ థియేటర్స్ లో రిలీజ్ అయిన నాలుగు వారాల తర్వాత ఓటిటి లో విడుదల అవ్వాలి. ఇప్పుడు ఆ ఒప్పందం ప్రకారం ఈ నెల 27 న స్కంద అందరి ఇళ్లల్లో మారుమోగిపోనుంది. ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫారం సంస్థ అయిన డిస్నీప్లస్ హాట్ ద్వారా స్కంద విదుదల కాబోతుంది. అయితే ఈ మేరకు అధికారంగా ఆ సంస్థ నుంచి ప్రకటన రావలసి ఉంది.