English | Telugu

మంచు విష్ణు 'కన్నప్ప'లో సూపర్ స్టార్!

మంచు విష్ణు డ్రీం ప్రాజెక్ట్ 'కన్నప్ప'పై రోజురోజుకి ఆసక్తి పెరుగుతోంది. రోజుకో బడా స్టార్ ఈ ప్రాజెక్ట్ లో చేరుతున్నారు. ఇప్పటికే ప్రభాస్, నయనతార, మోహన్ లాల్ వంటి బిగ్ స్టార్స్ ఈ ప్రాజెక్ట్ లో భాగమైనట్లు దాదాపు క్లారిటీ వచ్చేసింది. అయితే ఇప్పుడు ఈ సినిమాకి మరో అట్రాక్షన్ తోడైంది. కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ కన్నప్పలో ప్రత్యేక పాత్ర పోషించనున్నట్లు తెలుస్తోంది.

'కన్నప్ప'పై మంచు విష్ణు ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ఈ సినిమాతో తన కెరీర్ కి బిగ్ బ్రేక్ వస్తుందని నమ్ముతున్నాడు. ఆ నమ్మకంతోనే దాదాపు రూ.100 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నాడు. ఈ సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎందరో నటీనటులు, సాంకేతిక నిపుణులను రంగంలోకి దింపుతున్నాడు. ఈ క్రమంలోనే కన్నప్ప కోసం కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ ని రంగంలోకి దింపినట్లు తెలుస్తోంది. ప్రభాస్, నయనతార, మోహన్ లాల్, శివరాజ్ కుమార్ వంటి స్టార్ల చేరికతో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.