English | Telugu

పెళ్ళి చేసుకోబోతున్న శ్రీలీల.. అసలీ రూమర్‌ ఎలా వచ్చిందంటే..?

ఆమె నటించిన సినిమాలు ఎక్కువగా రిలీజ్‌ అవ్వకపోయినా ఆమె ఇప్పుడు టాలీవుడ్‌లో టాప్‌ హీరోయిన్‌. ఈ దసరా నుంచి సంక్రాంతి వరకు ఆమె చేసిన సినిమాలు నెలకొకటి రిలీజ్‌ కాబోతున్నాయి. అంతేకాదు, ఆమె కమిట్‌ అయిన సినిమాలు కూడా చాలానే ఉన్నాయి. ఇంతకీ ఆ హీరోయిన్‌ ఎవరంటే.. శ్రీలీల.‘పెళ్ళిసందడి’ చిత్రంతో హీరోయిన్‌గా పరిచయమైన ఈ అమ్మాయి తెలుగు అమ్మాయే. అయినా కర్ణాటకలో పెరిగింది. రవితేజతో చేసిన రెండో సినిమా ‘ధమాకా’తో హీరోయిన్‌గా ఆమె టాలెంట్‌ ఏమిటో మన మేకర్స్‌కి తెలిసింది. ఇక వెంట వెంటనే అవకాశాలు వెల్లువలా వచ్చి పడ్డాయి. ‘గుంటూరు కారం’, ‘భగవంత్‌ కేసరి’ వంటి పెద్ద సినిమాల్లో అవకాశాలు వచ్చాయి.

ఇదిలా ఉంటే.. ఇటీవల ఆమె పెళ్ళి చేసుకోబోతోందనే రూమర్‌ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొట్టింది. అసలు ఈ రూమర్‌ ఎలా పుట్టిందంటే.. భగవంత్‌ కేసరి షూటింగ్‌ సమయంలో బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ సెట్‌కి వచ్చాడు. డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి, మోక్షజ్ఞ, శ్రీలీల కలిసి వున్న ఫోటో ఒకటి బయటికి వచ్చింది. ఆ ఫోటోను బేస్‌ చేసుకొని మోక్షజ్ఞతో శ్రీలీల పెళ్ళి అంటూ ఓ రూమర్‌ను పుట్టించారు.ఈ రూమర్‌ గురించి శ్రీలీల క్లారిటీ ఇస్తూ.. ఇప్పుడిప్పుడే హీరోయిన్‌గా ఇండస్ట్రీలో నిలదొక్కుకుంటున్నాను. నా పెళ్ళి అంటూ వచ్చిన వార్తలో ఎలాంటి నిజం లేదు. ఇలాంటి వార్తలు రాసే ముందు నిజం తెలుసుకోవాలని కోరింది.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.