English | Telugu
వామ్మో మరి అంత రేటా ఎన్టీఆర్!
Updated : Oct 12, 2023
NTR అంటేనే న్యూ టాలీవుడ్ రికార్డ్స్ కి మారు పేరు. కీర్తి శేషులు నందమూరి హరికృష్ణ గారు చెప్పినట్టు ఏ ముహూర్తాన పెద్దాయన(నందమూరి తారక రామారావు) తారక్ కి నందమూరి తారక రామారావు అని తన పేరునే పెట్టాడోగాని జూనియర్ ఎన్టీఆర్ తన తాత లెగసి ని కంటిన్యూ చేస్తూ తెలుగు చిత్ర సీమకి తన యాక్టింగ్ పవర్ ని చూపిస్తూ లక్షలాది మంది అభిమానులని సంపాదించి తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర కథానాయకుడుగా కొనసాగుతున్నాడు. ఎన్టీఆర్ నుంచి ఎలాంటి వార్త వచ్చిన సంచలనమే. ఎన్నో సార్లు ఆయన ధరించిన డ్రెస్ అలాగే చేతికి ధరించే వాచ్ గురించి చర్చకు వచ్చింది. తాజాగా మరో సారి ఆయన తన చేతికి ధరించిన వాచీ గురించి చర్చకు వచ్చింది. చర్చకు రావడమే కాదు ఆయన ధరించిన వాచీ ధర విషయం సంచలనం సృష్టిస్తుంది.
ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమా షూటింగ్ లో చాలా బిజీగా ఉన్నాడు. ఇటీవలే ఎన్టీఆర్ కి సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలని కూడా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించాడు. ఎన్టీఆర్ కెరీర్ లోనే అత్యంత భారీ వ్యయం తో దేవర సినిమా నిర్మాణం జరుగుతుంది. ఇంతవరకు ఎన్టీఆర్ నటనలో ఎవరు చూడని సరికొత్త కోణంతో ఈ సినిమా ఉండబోతుంది. ఎన్టీఆర్ అభిమాను లు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ఈ విషయాలన్నీ ఒక పక్కన ఉంచితే ఎన్టీఆర్ చిన్న సినిమాలని ప్రోత్సహించడంలో ఎప్పుడు ముందు వరుసలో ఉంటారు. ఎన్నో సినిమాలకి తన వంతు ప్రమోషన్స్ ఇస్తూ సినిమాని ప్రేక్షకులందరికీ చేరవేస్తాడు. తాజాగా మ్యాడ్ మూవీ ప్రమోషన్స్ లో పాల్గొన్నాడు. ఆ సమయంలో ఎన్టీఆర్ తన చేతికి ధరించిన వాచీ ఒకటి పలువుర్ని ఆకర్షించింది.
ఆ తర్వాత ఎన్టీఆర్ ధరించిన వాచీ కంపెనీ, వాచీ రేటుని తెలుసుకున్న అందరు ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. కొంత మంది అయితే ఎన్టీఆర్ అంటే అలాగే ఉంటుంది అని అన్నారు. ఎన్టీఆర్ ధరించిన వాచీ స్విస్ లగ్జరి బ్రాండ్ ఎం&బి కి చెందినది. ఆ వాచీ ధర అక్షరాలా కోటి అరవై ఆరు లక్షల రూపాయిలు. మ్యాడ్ ప్రమోషన్స్ అప్పుడు ఎన్టీఆర్ తో సంగీత్ శోభన్ ఫోటో దిగినప్పుడు ఎన్టీఆర్ ధరించిన వచ్చి క్లియర్ గా కనపడింది. దాంతో ఇప్పుడు ఎన్టీఆర్ ధరించిన వాచీ ధర విషయం నెట్టింట సంచలనం సృష్టిస్తుంది.