English | Telugu
‘సలార్’ బిజినెస్ బ్లాస్ట్... ఏపీ సర్కార్ ఒప్పుకుంటుందా?
Updated : Oct 24, 2023
ఇప్పుడు ప్రేక్షకులు, ప్రభాస్ అభిమానులు, సినీవర్గాలు... ఇలా అందరి దృష్టీ ‘సలార్’పైనే ఉంది. డిసెంబర్ 22న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. దానికింకా రెండు నెలలు టైమ్ వున్నప్పటికీ సినిమాపై అంచనాలు మాత్రం తారాస్థాయిలో ఉన్నాయి. బాహుబలి సిరీస్ బ్లాక్ బస్టర్ హిట్ అయిన తర్వాత వచ్చిన ప్రభాస్ సినిమాలన్నీ నిరాశపరిచాయి. అయినా ప్రభాస్ రేంజ్ ఏమాత్రం తగ్గలేదు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా... ‘కెజిఎఫ్’ సిరీస్ వంటి గొప్ప హిట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో సినిమా వస్తోందంటే దాని క్రేజ్ ఏ రేంజ్‌లో ఉంటుందో ఇప్పుడు ‘సలార్’ని చూస్తే అర్థమవుతుంది.
ఈమధ్యకాలంలో ప్రభాస్‌కి హిట్ లేకపోయినా అతని సినిమాలపై తమకి వుండే ఎక్స్‌పెక్టేషన్స్ మాత్రం తగ్గేదేలే అంటున్నారు అభిమానులు. డిసెంబర్ 22కి ‘సలార్’ రిలీజ్ అవుతుంది. ఈ ఒక్క అప్‌డేట్ తప్ప చెప్పుకోదగిన అప్‌డేట్ ఈ సినిమా నుంచి రాలేదు. దీని అప్‌డేట్స్ కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు.
ఈ సినిమా ఫస్ట్ వీక్‌లోనే బాక్సాఫీస్ బద్దలు చేస్తుందని ట్రేడ్‌వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటికే ‘సలార్’ డిజిటల్ రైట్స్ ఎవ్వరూ ఊహించనంత బిగ్గెస్ట్ రేటుకి అమ్మారని వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు థియేట్రికల్ రైట్స్‌కి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. నైజాం ఏరియా థియేట్రికల్ రైట్స్‌ను మైత్రి మూవీస్ సంస్థ సొంతం చేసుకుందని తెలుస్తోంది. ఎన్ ఆర్ ఎ పద్ధతిలో రూ.65 కోట్లకు నైజాం రైట్స్‌ను ఈ సంస్థ కొనుగోలు చేసిందని సమాచారం. బిజినెస్ ఎంత ఎక్కువగా జరిగితే కలెక్షన్లు కూడా ఆ రేంజ్‌లోనే రావాలి. సినిమా మీద ఉన్న క్రేజ్‌తో ఇలాంటి అబ్‌నార్మల్ రేట్స్‌తో సినిమాని కొంటే వాటిని రాబట్టడానికి, లాభాలు గడిరచడానికి టికెట్ రేట్స్ ఎంత పెంచాల్సి వస్తుంది, ఎన్ని షోలు వెయ్యాలి, ఏయే టైమింగ్స్‌లో షోలు వేస్తే బాగుంటుంది అనే అంశాలపై బయ్యర్ల మధ్య చర్చలు జరుగుతున్నాయని తెలుస్తోంది. రోజుకి కనీసం 6 షోలు వేస్తేనే బయ్యర్లకు గిట్టుబాటు అయ్యే పరిస్థితి ఉంది. ఇదంతా బాగానే ఉంది. రోజుకి 6 షోలు వేసేందుకు, టికెట్స్ రేట్లను పెంచేందుకు ప్రభుత్వం సంసిద్ధంగా ఉంటుందా అనేది ప్రశ్న. మరి ఈ విషయంలో తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయో చూడాలి.