English | Telugu

బాలకృష్ణ వంటి డెడికేటెడ్‌ హీరోలు ఉంటే.. ‘భగవంత్‌ కేసరి’ లాంటి బ్లాక్‌బస్టర్స్‌ వస్తాయి!

నటసింహ నందమూరి బాలకృష్ణ లేటెస్ట్‌ సెన్సేషన్‌ ‘భగవంత్‌ కేసరి’ ప్రపంచవ్యాప్తంగా ప్రభంజనం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. రోజుకీ పెరుగుతున్న కలెక్షన్లతో తన రేంజ్‌ను పెంచుకుంటూ వెళ్తున్న ‘భగవంత్‌ కేసరి’ యునానిమస్‌గా దసరా విన్నర్‌గా తన స్థానాన్ని పదిలపరుచుకున్నారు నందమూరి బాలకృష్ణ. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్‌ దసరా పండగను ‘భగవంత్‌ కేసరి’తో సెలబ్రేట్‌ చేసుకునేందుకు బ్లాక్‌ బస్టర్‌ దావత్‌ను ఏర్పాటు చేసింది చిత్ర యూనిట్‌. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ ఎమోషన్‌ అయిపోయి మాట్లాడడం.. సినిమా ఏ రేంజ్‌ హిట్‌ అనేది చెప్పకనే చెప్తోంది. ఈ సక్సెస్‌ సెలబ్రేషన్స్‌కి ప్రముఖ నిర్మాత దిల్‌రాజు హాజరై సినిమాపై తన అభిప్రాయాన్ని తెలియజేశారు.

‘‘బాలకృష్ణగారికి ఉన్న డెడికేషన్‌ వల్లే ఈ సినిమా ఇంత పెద్ద విజయాన్ని అందుకుంది. దర్శకుడు రాసిన కథను హీరో ఓన్‌ చేసుకుంటే తప్పకుండా అద్భుతమైన సినిమాలు వస్తాయి. నేను సినిమాలు చూడడం మొదలు పెట్టినప్పటి నుంచి చూస్తే మంగమ్మగారి మనవడు, ముద్దుల మావయ్య క్లాసిక్‌ మూవీస్‌. కోడి రామకృష్ణ, ఎస్‌.గోపాల్‌రెడ్డి కాంబినేషన్‌లో రూపొందిన అద్భుతమైన సినిమాలవి. ఆ తర్వాత 10 ఏళ్ళకు సమరసింహారెడ్డి, నరసింహనాయుడు.. ఈ రెండూ బి.గోపాల్‌తో బాలకృష్ణగారు చేసిన క్లాసిక్స్‌. ఈ సినిమాల్లో చక్కని కథ, ఫ్యామిలీ సెంటిమెంట్‌తో పాటు హీరోయిజం ఒక రేంజ్‌లో ఉంటుంది. ఆ తర్వాత బాలకృష్ణగారితో మా బోయపాటి చేసిన సింహా, లెజెండ్‌, అఖండ వంటి బ్లాక్‌బస్టర్స్‌ బాలయ్యబాబు రేంజ్‌ని మరింత పెంచాయి. ఇప్పుడు బాలకృష్ణగారు ఓ కొత్త దనానికి శ్రీకారం చుట్టారు. ఇంతకుముందెన్నడూ లేని విధంగా తెలంగాణ స్లాంగ్‌లో డైలాగులు చెప్పి అందర్నీ మెప్పించారు. బాలకృష్ణగారి డెడికేషన్‌ వల్లే ‘భగవంత్‌ కేసరి’ ఈ రేంజ్‌ హిట్‌ సాధించింది. సర్‌.. మీ గురించి మాట్లాడేంత గొప్పవాడిని కాదు నేను. సినిమా చూసి ఎంతో ఎమోషనల్‌ అయ్యాను. అందుకే ఈ మాటలు నా నుంచి వస్తున్నాయి. ఇంతకుముందే ఎవరో అన్నట్టు మీకు అందరూ లేచి నిలబడి సలామ్‌ కొట్టాలి. ఎందుకంటే ఇంత రేంజ్‌ సినిమా చేస్తూ క్లైమాక్స్‌లో ఒక అమ్మాయితో కలిసి ఫైట్‌ చెయ్యడానికి ఒప్పుకున్నందుకు మీకు హ్యాట్సాఫ్‌ సర్‌. నాకు 50 సినిమాలు చేసిన ఎక్స్‌పీరియన్స్‌ ఉంది కాబట్టి... ఇది ఏ రేంజ్‌ సినిమా అవుతుంది అని సాహు నన్ను అడిగాడు. నాకు తెలిసి ఇది లాంగ్‌ రన్‌ మూవీ. ఒక సినిమాకి ఫ్యామిలీ ఆడియన్స్‌ కనెక్ట్‌ అయితే తప్పకుండా అది పెద్ద హిట్‌ అవుతుంది. అలాంటి ఫ్యామిలీ సినిమాలు చేసాను, విజయాలు సాధించాను కాబట్టి అది నాకు తెలుసు. కాబట్టి ఈ సినిమా నిర్మాతలు ధైర్యంగా ఉండొచ్చు’’ అన్నారు దిల్‌రాజు.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.