English | Telugu

థియేటర్స్‌ నుంచి ఇంటికి వచ్చేస్తోంది.. పిల్లల్ని ఎలా కంట్రోల్‌ చేస్తారు?


ఆమధ్య ఓ సినిమాని పిల్లలతో కలిసి చూడొద్దని గట్టిగా చెప్పారు. అంటే ఆ సినిమాలో అంత హింస ఉందనేది వారి ఉద్దేశం. ఈ విషయాన్ని ఎవరో కాదు, హీరోనే చెప్పడం విశేషం. ఇంతకీ ఏ సినిమా అది, ఆ హీరో ఎవరు? ఆ సినిమా పేరు తమిళ్‌లో ఇరైవన్‌, తెలుగులో గాడ్‌, ఆ చెప్పిన హీరో జయం రవి. ఇటీవల గాడ్‌ చిత్రం విడుదలైంది. తెలుగులో ఆశించిన స్థాయిలో ఈ సినిమా ఆకట్టుకోలేదు. అయితే తమిళ ప్రేక్షకులు మాత్రం ఈ సినిమాని పాస్‌ చేసేశారట. జయం రవి తన అద్భుతమైన పర్ఫార్మెన్స్‌, నయనతార అందం, అభినయం తమిళ్‌ ప్రేక్షకులను కట్టిపడేసింది. టెక్నికల్‌గా కూడా ఈ సినిమా హై స్టాండర్డ్స్‌లోనే ఉండడంతో సినిమా మంచి విజయం సాధించింది. దర్శకుడు ఐ.అహ్మద్‌కు డైరెక్టర్‌గా మంచిపేరు వచ్చింది.

సినిమాలో జయం రవి, ఆండ్రూ ఏసీపీలు. చాలా ధైర్యంగా కేసులు చేధిస్తూ డిపార్ట్‌మెంట్‌లో మంచి పేరు సంపాదించుకుంటారు. నేరస్థులను పట్టుకోవడం, వారిని విచారించడం, ఆ తర్వాత కోర్టులో హాజరు పరచడం, వారికి శిక్ష పడేలా చేయడం అనేది పెద్ద తతంగమని, టైమ్‌ వేస్ట్‌ అనేది వీరిద్దరి అభిప్రాయం. అందుకే నేరస్థులను ఎన్‌కౌంటర్‌ చేస్తుంటారు. ఒకరి తప్పులను మరొకరు కప్పిపుచ్చుతూ ఉంటారు. అలాంటి వీరిద్దరికి సైకో కిల్లర్‌ కేసు అప్పగిస్తారు ఉన్నతాధికారులు. అక్కడి నుంచి సినిమా అసలు కథలోకి ఎంటర్‌ అవుతుంది. నగరంలో 10 మంది అమ్మాయిలను దారుణంగా హత్యలు చేసే సీరియల్‌ సైకో కిల్లర్‌ కేసును వారిద్దరూ ఛేదిస్తారు. అయితే ఈ క్రమంలో ఆండ్రూ ప్రాణాలు కోల్పోతాడు. కథ ఆసక్తికరంగానే ఉన్నప్పటికీ హింస పాళ్ళు అధికం కావడంతో హీరో జయం రవి సినిమా చూసిన వాళ్ళు ఏమంటారోనని భయపడినట్టున్నాడు. అందుకే పిల్లలతో కలిసి ఈ సినిమా చూడొద్దని ప్రచారం చేశాడు. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో ప్రత్యక్షం కాబోతోంది. నెట్‌ఫ్లిక్స్‌ సంస్థ ఈ సినిమా డిజిటల్‌ రైట్స్‌ను సొంతం చేసుకుంది. తెలుగు, తమిళ్‌, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో


ఈ సినిమా స్ట్రీమింగ్‌ అవ్వనుంది. మరి ఇప్పటివరకు థియేటర్స్‌లో కాబట్టి ఈ సినిమాను పిల్లలకు దూరంగా ఉంచగలిగారు. మరిప్పుడు ఇంటికే వచ్చేసింది. ఇప్పుడు ఈ సినిమాను చూడకుండా పిల్లల్ని ఎలా కంట్రోల్‌ చేస్తారో మరి!

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .