English | Telugu

ఫారిన్ లో ఆత్మల మార్పిడి చేసుకొని తెలుగు సినీ ప్రేక్షకుల ముందుకు..

తెలుగు సినిమా పరిశ్రమ పుట్టినప్పటి నుంచి ఎన్నో కొత్త కొత్త కథలు వచ్చి ప్రేక్షకులని అలరించాయి. కేవలం అలరించడమే కాకుండా ప్రేక్షకులకి ఒక కొత్త లోకాన్ని పరిచయం కూడా చేసాయి. అలాంటి కొత్త లోకాన్ని ప్రేక్షకులకి పరిచయం చేయడానికి ఒక చిత్రం విడుదలకి ముస్తాబు అవుతుంది. తాజాగా ఆ చిత్రం నుంచి రిలీజ్ అయిన ట్రైలర్ సినిమా ఎంత కొత్తగా ఉండబోతుందో తెలియచేసింది.

7:11 pm సినిమాతో వెండి తెరకి పరిచయమైన నటుడు సాహస్ పగడాల హీరోగా దర్శకుడుగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ధీమహి. చనిపోయిన వాళ్ళతో మాట్లాడటం, ఆత్మల మార్పిడి అనే ఒక విన్నూతనమైన కాన్సెప్ట్ తో ధీమహి చిత్రం రూపుదిద్దుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ చిత్రం నుంచి ట్రైలర్ రిలీజ్ అయ్యి మెంబర్ ఆఫ్ వ్యూయర్స్ తో సంచలనం సృష్టిస్తుంది. ట్రైలర్ తో సినిమాని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే క్యూరియాసిటీ ని ధీమహి కలిగించింది. చనిపోయిన వాళ్ళతో మాట్లాడటాన్ని ఇంగ్లీష్ భాషలో నెక్రోమాన్సీ అని అంటారు. సినిమా మొత్తం పూర్తిగా ఫారిన్ లోనే చిత్రీకరణ జరుపుకుంది.

కెప్టెన్ కుక్ ఫిలిమ్స్ పతాకంపై విరాట్ కపూర్, సాహస్ పగడాల సంయుక్తంగా నిర్మించిన ఈ ధీమహి చిత్రానికి సాహస్ పగడాల, నవీన్ కంటే లు దర్శకులు. నిఖిత చోప్రా హీరోయిన్ గా చేస్తుంది. షారోన్ రవి సంగీతం అందిస్తున్న ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల 27న విడుదల కాబోతుంది. సాహస్ తన మొదటి చిత్రం 7:11 PM చిత్రంతో టైం ట్రావెల్ కాన్సెప్ట్‌ తో ప్రేక్షకుల ముందుకొచ్చి ఇప్పుడు తన రెండవ చిత్రంతో ఆత్మల మార్పిడి అనే డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.