English | Telugu

విజయవాడకి వియ్యంకుడు కాబోతున్న విక్టరీ వెంకటేష్..

విక్టరీ వెంకటేష్ అంటే కేవలం తన అభిమానులకే కాకుండా సాధారణ సినిమా ప్రేక్షకులకి కూడా ఎంతో అభిమానం. గత 36 సంవత్సరాల నుంచి ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాల్లో నటించి కోట్లాది మంది అభిమానుల గుండెల్లో వెంకీ గా ఆయన కొలువు తీరి ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఫ్యామిలీ కి సంబంధించి వస్తున్న వార్త ఆయన అభిమానులతో పాటు సినీ అభిమానులని ఆనందంలో ముంచెత్తుతుంది.

తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న అందరి హీరో ల ఫ్యామిలీ డిటైల్స్ గురించి ఆయా హీరో ల అభిమానులతో పాటు సాధారణ సినీ ప్రేక్షకుల అందరికి తెలుసు. కానీ వెంకటేష్ ఫ్యామిలీ డిటైల్స్ ఏమిటి వెంకీ వైఫ్ అండ్ పిల్లలు ఎలా ఉంటారు అని మాత్రం గత కొన్ని సంవత్సరాల వరకు ఎవరకి తెలియదు. తన భార్య గురించి గాని పిల్లలు గురించి గాని చెప్పడం గాని వాళ్ళని మీడియా ముందుకు తీసుకొచ్చి పరిచయం చెయ్యడం కానీ చెయ్యలేదు. అంతలా వెంకటేష్ తన ఫ్యామిలీ ప్రొఫైల్ ని మెయిన్ టైన్ చేసాడు. ఇక ఇప్పుడు టెక్నాలజీ పుణ్యమా అని మారిన వాతావరణ పరిస్థితులని బట్టి సోషల్ మీడియా ద్వారా వెంకటేష్ వైఫ్ అండ్ పిల్లలగురించి అందరికి తెలిసింది.
ఇక అసలు విషయానికి వస్తే వెంకేటేష్ పెద్ద కూతురు అశ్రీత వివాహం సంవత్సరం క్రితం ఆమె ప్రేమించిన వ్యక్తితో అతిరధుల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగింది. ఇప్పుడు వెంకటేష్ రెండో కూతురు హయ వాహిని కూడా పెళ్లి పీటలు ఎక్కనుంది. వెంకటేష్ రెండో కూతురు హయ వాహిని వివాహం విజయవాడ కి చెందిన ఒక డాక్టర్ కొడుకుతో జరగనుంది. రేపు విజయవాడ లోఇద్దరికి నిశ్చితార్థం కూడా అత్యంత ఘనంగా జరగనుంది. దీంతో దగ్గుబాటి కుటుంబంలో పెళ్లి సందడి ప్రారంభం అయ్యింది. వెంకటేష్ తాజాగా సైంధవ్ అనే మూవీలో నటిస్తున్నాడు ఇటీవలే రిలీజ్ అయిన ట్రైలర్ రికార్డు వ్యూయర్స్ తో ముందుకు దూసుకుపోతుంది.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.