English | Telugu

చిత్ర పరిశ్రమని వాడుకుంటున్నారు.. పవన్ హాట్ కామెంట్స్

ఉన్నది ఉన్నట్లు ముక్కుసూటిగా చెప్పడం పవన్ కళ్యాణ్ స్టైల్. ఇపుడు ఆయన సినిమా నటుడిగానే కాకుండా రాజకీయ నాయకుడుగా కూడాను తన బాధ్యతని నిర్వహిస్తున్నాడు. పవన్ కళ్యాణ్ తాజాగా ఒక మీడియా ఛానల్ ఓపెనింగ్ కి వెళ్ళాడు. ఆ కార్యక్రమంలో ఆయన టీవీ మీడియా గురించి చేసిన వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి.

ప్రముఖ వార్త ఛానల్ అయిన మహా న్యూస్ ఛానల్ తాజాగా మహా మాక్స్ అనే ఒక కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ కి సంబంధించిన ఛానల్ ని ప్రారంభించింది. ఈ ఛానల్ పూర్తిగా సినిమా రంగానికి చెందిన న్యూస్ నే టెలికాస్ట్ చేయనుంది. నిన్న ఈ ఛానల్ ప్రారంభోత్సవం ప్రముఖ నటుడు ,జన సేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా జరిగింది. ఈ సందర్భంగా ఛానల్ ని ప్రారంభించిన తర్వాత పవన్ మాట్లాడుతు ఇంతవరకు తెలుగు సినీ పరిశ్రమకి సంబంధించి కంప్లీట్ గా ఒక ఛానల్ అంటూ లేదు ఇన్నాళ్లనుంచి న్యూస్ చానెల్స్ లో నే సినిమా వార్తలని ప్రసారం చేస్తూ వస్తున్నారు కానీ మొట్టమొదటి సారి సినిమా వార్తలకి మహా న్యూస్ వారు మహా మాక్స్ ని ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. అలాగే న్యూస్ ఛానెళ్ల కి సంబంధించి కొన్ని ఘాటైన వ్యాఖ్యలు కూడా చేసారు. కొన్ని టీవీ ఛానెల్స్ వారు తమ ఇష్టానుసారంగా డిబేట్ లని పెడుతున్నారు. ఆ డిబేట్ లో రాజకీయనాయకులు సినిమా వాళ్ళని ఎంత మాటపడితే అంత మాట అనడం కామన్ అయిపోయింది.

ప్రతి ఒక్కళ్ళకి సినిమా అనేది చాలా సాఫ్ట్ కార్నర్ సినిమా వాళ్ళని ఏమైనా అంటే వాళ్ళు ఏమి మాట్లాడారనే విధంగా రాజకీయనాయకులు కొంత మంది మేధావులు తయారయ్యారని తన ఆవేదనని పవన్ వెళ్లబుచ్చాడు. అలాగే చానెల్స్ కేవలం తమ టిఆర్పి రేటింగ్ కోసం సినిమా వాళ్ళని తిట్టే డిబేట్ లని తమ ఛానల్ లో ఏర్పాటు చేస్తూ నటుల వ్యక్తిగత జీవితంలోకి వెళ్లి వాళ్ళ ఇంట్లో వాళ్ళని కూడా తిట్టే స్థాయికి తీసుకెళ్తున్నారని పవన్ అన్నారు. సినిమా వాళ్ళ మీద విమర్శ చేసే వాళ్ళ నోళ్లు అదుపులోకి రావాలంటే సినిమా కి సెన్సార్ ఉన్నట్టుగానే టీవీ చానెల్స్ కి కూడా సెన్సార్ ఉండాలని పవన్ అన్నారు . అలాగే నూతంగా ఏర్పడిన మహా మాక్స్ ఛానెల్ వివాదాలని సృష్టించి వాటిని అమ్ముకోకుండా కళ ని ప్రోత్సహించే దిశగా వెళ్లాలని అలాగే చిత్ర సీమలో ఉన్న సమస్యలని కూడా బయటకి తీసుకొచ్చి సినిమా పరిశ్రమకి ఉపయోగపడాలని పవన్ కళ్యాణ్ సూచించారు. హైదరాబాద్ లోని ఎన్ కన్వెన్షన్ హాల్ లో మహా మాక్స్ ఎంటర్ టైన్ మెంట్ ఛానల్ ఓపెనింగ్ కార్యక్రమం జరిగింది.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.