English | Telugu

సితార హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వడం ఖాయం.. డిసైడ్‌ అయిన అభిమానులు!

టాలీవుడ్‌ హీరోల కుమార్తెలు అప్పుడప్పుడు సోషల్‌ మీడియాలో సందడి చేయడం మనం చూస్తుంటాం. అయితే మహేష్‌ కుమార్తె సితారకు ఒక ప్రత్యేకమైన స్టైల్‌ వుంది. తను పెట్టే వీడియోలతో అందర్నీ మెస్మరైజ్‌ చేసేస్తుంది. సోషల్‌ మీడియాలో ఫేమస్‌ అయ్యేందుకు ఎవరి స్టైల్‌ వారిది. కానీ, సితార వారందరి కంటే డిఫరెంట్‌గా కనిపించేందుకు ట్రై చేస్తుంది. అక్కడే ఆమె సక్సెస్‌ దాగి ఉందని అందరికీ తెలిసిందే. ఏ పండగ వచ్చినా దానికి సంబంధించి ఏదో ఒక పోస్ట్‌తో అందర్నీ తనవైపు తిప్పుకోవడంలో సితార స్పెషాలిటీయే వేరు అని చెప్పాలి. ఇప్పుడు దసరా పండగ వచ్చేసింది. కాబట్టి దానికి తగిన వీడియో తను చెయ్యాలని ఫిక్స్‌ అయింది సితార. అందుకే పండగ వాతావరణాన్ని మన ముందుకు తీసుకువచ్చేందుకు ఒక హిందీ పాటకు డాన్స్‌ చేస్తూ ప్రేక్షకుల్ని, అభిమానుల్ని, నెటిజన్లను ఆకర్షించింది. ఎక్కువగా సోలోగానే కనిపించే సితార ఈసారి గ్రూప్‌ సాంగ్‌తో అందరి ముందుకు వచ్చింది. తన సిగ్నేచర్‌ స్టెప్స్‌తో పాటకు అనుగుణంగా కదులుతున్న సితారను చూస్తే ఎవ్వరికైనా ముచ్చటేస్తుంది. రెండు చేతులు గాల్లోకి తిప్పి...కాళ్లు వేగంగా కదుపుతూ తన ఎనర్జీ ఏమిటో మరోసారి చూపించింది.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో చాలా పెద్ద వైరల్‌ అయిపోయింది. ఇప్పటికే దాదాపు 3 లక్షల లైక్స్‌ సాధించిన ఈ వీడియో మరింత స్పీడ్‌గా ముందుకు వెళుతోంది. సితార పెర్‌ఫార్మెన్స్‌కి అభిమానులు ఫిదా అయిపోతున్నారు. సితార గొప్ప డాన్సర్‌ అంటూ ఆమెను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. హీరోయిన్‌గా అద్భుతంగా రాణించే అంశాలు సితారలో పుష్కలంగా ఉన్నాయని, ఆమె కెమెరా ముందుకు ఎప్పుడొస్తుందా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. త్వరలోనే ఆమె టాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. నటిగా తండ్రి వారసత్వాన్ని పుణికి పుచ్చుకోవడమే కాదు, హీరోయిన్‌గా నమ్రత సాధించలేని విజయాలు వారి కుమార్తె సితార సాధిస్తుందని సూపర్‌స్టార్‌ అభిమానులు గట్టిగా నమ్ముతున్నారు. మహేష్‌ కుమారుడు గౌతమ్‌ హీరో అవుతాడా? లేదా? అనే విషయాన్ని పక్కనపెట్టి ఇప్పుడంతా సితార గురించే ఊహాగానాలు చేస్తున్నారు. మరి అభిమానులు ఆశించే విధంగా హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తుందా? చూడాలి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.