English | Telugu

తగ్గే కొద్దీ మింగుతారు... హీరో విశ్వ‌క్ సేన్‌ ఫైర్! 

యంగ్ హీరో విశ్వక్ సేన్‌ని ఎవ‌రైనా బెదిరించారా? ఏమో తెలియ‌దు. కానీ ఆయ‌న త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన పోస్ట్ చూస్తుంటే అదే నిజ‌మ‌ని అనిపిస్తుంది. అసలు విశ్వ‌క్‌సేన్‌ని ఎవ‌రు బెదిరించారు. ఏ విష‌యంలో ఏమ‌ని అన్నారు? అనే వివ‌రాల్లోకి వెళితే, విశ్వ‌క్ సేన్ హీరోగా న‌టించిన తాజా చిత్రం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. నేహా శెట్టి హీరోయిన్‌గా న‌టించింది. కృష్ణ చైత‌న్య ద‌ర్శ‌క‌త్వంలో సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చాలా రోజుల కింద‌టే ఈ సినిమాను డిసెంబ‌ర్ 8న విడుద‌ల చేస్తున్న‌ట్లు మేక‌ర్స్ తెలిపారు.

అయితే ఇప్పుడు రిలీజ్ డేట్‌లో మ‌ళ్లీ ఏదో స‌మ‌స్య వ‌చ్చిన‌ట్లుంది. దీంతో విశ్వ‌క్ సేన్ ఫైర్ అయ్యాడు. ‘‘బ్యాగ్రౌండ్ లేకపోతే ప్రతీ నా కొడుకు మన గేమ్ మారుద్దాం అనుకుంటాడు.. నేను సినిమా చూడకుండా ప్రతీ ఫ్రేమ్ ప్రాణం పెట్టి పని చేశాను కాబట్టే చెబుతున్నా.. డిసెంబర్ 8న వస్తున్నాం.. హిట్, ఫ్లాప్, సూపర్ హిట్, అట్టర్ ఫ్లాప్ చేస్తారన్నది మీ ఇష్టం (ప్రేక్షకులను ఉద్దేశించి).. అది మీ నిర్ణయం.. ఆవేశానికి లేదా ఈగోకి తీసుకునే నిర్ణయం కాదు.. తగ్గే కొద్దీ మింగుతారు అని అర్థమైంది.. డిసెంబర్ 8న శివాలెత్తిపోద్ది.. గంగమ్మ తల్లి కి నా ఒట్టు.. మహా కాళి మాతో ఉంది.. డిసెంబర్‌లో సినిమా రాకపోతే.. నేను ప్రమోషన్స్‌లో కనిపించను.. రాను’’.. అని విశ్వక్ సేను తన ఆవేశాన్ని వెల్ల‌గ‌క్కాడు.

అంటే విశ్వ‌క్ పెట్టిన మెసేజ్ చూస్తుంటే త‌న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి రిలీజ్ డేట్‌ను మార్చాల‌ని ఎవ‌రో నిర్మాత‌కు బ‌లంగా చెప్పిన‌ట్లు, ఆయ‌న హీరోకి చెప్పిన‌ట్లు తెలుస్తుంది. అయితే త‌న సినిమా బావుంద‌నే న‌మ్మ‌కం ఉండ‌టం, ఎప్పుడో రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తే మ‌ళ్లీ మార్చాల‌ని ఎవ‌రో చెప్ప‌టం వంటి విష‌యాలు విశ్వ‌క్‌ను బాధించిన‌ట్లు ఉన్నాయి. మ‌రిప్పుడు విశ్వ‌క్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి రిలీజ్ డేట్ వ్య‌వ‌హారం ఎక్క‌డి వ‌ర‌కు వెళుతుందో చూడాలిక‌.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.