English | Telugu
ఓటీటీలోకి రామ్, బోయపాటిల మాస్ ఫిల్మ్ 'స్కంద'!
Updated : Oct 28, 2023
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా బోయపాటి శ్రీను డైరెక్షన్ లో రూపొందిన యాక్షన్ ఫిల్మ్ 'స్కంద'. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ నిర్మించిన ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్. రామ్-బోయపాటి కాంబినేషన్ లో తెరకెక్కిన మొదటి సినిమాగా భారీ అంచనాలతో సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ అంచనాలను అందుకోలేకపోయినప్పటికీ, మాస్ ప్రేక్షకులను ఈ సినిమా బాగానే మెప్పించింది. ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీలో అలరించడానికి సిద్ధమవుతోంది.
'స్కంద' డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని డిస్నీ+ హాట్ స్టార్ దక్కించుకుంది. ఈ చిత్రం నవంబర్ 2 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని తాజాగా అధికారిక ప్రకటన వచ్చింది. అంటే సరిగ్గా థియేటర్లలో విడుదలైన ఐదు వారాలకు ఓటీటీలోకి రాబోతుందన్నమాట. మరి థియేటర్లలో అంచనాలను అందుకోలేకపోయిన స్కంద.. ఓటీటీలో ఏ స్థాయి ఆదరణ పొందుతుందో చూడాలి.
సాయి మంజ్రేకర్, శ్రీకాంత్, శరత్ లోహితస్య, అజయ్ పుర్కర్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించాడు.