English | Telugu
చియాన్ 62 అనౌన్స్‌మెంట్.. ఊరమాస్ అంటున్న ఫ్యాన్స్
Updated : Oct 29, 2023
తను పోషించే పాత్రల్లో పరకాయ ప్రవేశం చేసి వాటికి ప్రాణం పోయటానికి ఎంతటి రిస్క్ చేయటానికైనా వెనుకాడని అతి కొద్ది మందిలో చియాన్ విక్రమ్ ఒకరు. ఇప్పటికే తంగలాన్, ధ్రువ నక్షత్రం వంటి సినిమాలతో ఆయన సందడి చేయటానికి రెడీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన 62వ సినిమాకు సంబంధించిన ప్రకటన వచ్చేసింది. అది కూడా వీడియో గ్లింప్స్ రూపంలో. దీన్ని చూస్తుంటే ఈసారి చియాన్ విక్రమ్ పక్కా మాస్ కమర్షియల్ ఫార్ములా మూవీతో మెప్పించబోతున్నారని అర్థమవుతుంది. పోలీస్ స్టేషన్‌కు హీరో వచ్చి అక్కడున్న పోలీసులను చితకబాదుతాడు. వాళ్లలో ఒకడు ఎవరు నువ్వు అడిగితే .. నేను డిప్యూటీ కమీషనర్ అని (విక్రమ్ సామి చిత్రంలో డైలాగ్) చెబుతాడు. ఈ వీడియో గ్లింప్స్‌లో హీరో ఫేస్ ఎక్కడా రివీల్ కాకుండా మాస్‌గానే చూపించారు దర్శకుడు కె.యు.అరుణ్ కుమార్.
హెచ్.ఆర్.పిక్చర్స్ బ్యానర్‌పై ఈ సినిమా రూపొందనుంది. వచ్చే ఏడాది నుంచే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఉంటుందని సినీ సర్కిల్స్ అంటున్నాయి. మరి ఇందులో హీరోయిన్, ఇతర వివరాలను మేకర్స్ ఇంకా ప్రకటించలేదు. అయితే ఆసక్తికరమైన విషయమేమంటే ఓ భాగంగా కాకుండా ఇప్పుడున్న ట్రెండ్‌ను ఫాలో అవుతూ చియాన్ 62 రెండు భాగాలుగా రూపొందనుంది. చిన్నా (తమిళంలో చిత్తా) దర్శకుడు అరుణ్ కుమార్ సినిమాను డైరెక్ట్ చేస్తుండటంతో సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.
మరో వైపు విక్రమ్ అభిమానుల హ్యాపీనెస్ మామూలుగా లేదు. ఎందుకంటే ఇప్పటికే రెండు సినిమాలను రిలీజ్‌కు సిద్ధం చేస్తున్న చియాన్, వెంటనే తన 62వ సినిమాకు సంబంధించిన అనౌన్స్‌మెంట్ ఇవ్వటం. అది కూడా పక్కా మాస్ కమర్షియల్ మూవీ కావటం. మరి ఈ సినిమాలో విక్రమ్ ఏ రేంజ్‌లో ఎంటర్‌టైన్ చేయబోతున్నారో తెలియాలంటే వచ్చే ఏడాది వరకు ఆగాల్సిందే.