English | Telugu
అమ్మ కోరిక తీర్చనున్న మహేష్ బాబు!
Updated : Oct 28, 2023
సూపర్ స్టార్ మహేష్ త్వరలోనే తన తల్లి ఇందిరమ్మ కోరికను తీర్చటానికి రెడీ అవుతున్నారంటూ సినీ సర్కిల్స్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. అసలు ఇంతకీ అమ్మ కోరికను తీర్చటానికి మహేష్ ఏం చేయబోతున్నారు..అంతలా మహేష్ అమ్మగారు కోరిన కోరిక ఏంటి? అనే వివరాల్లోకి వెళితే, మహేష్ పిల్లలు గౌతమ్, సితారలు సోషల్ మీడియాలో ఫ్యామిలీతో కనిపిస్తూనే ఉంటారు. మరీ ముఖ్యంగా సితార అయితే చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తండ్రికి పోటీగా అప్పుడే కమర్షియల్ యాడ్స్‌లోనూ నటించటానికి రెడీ అయిపోయింది. ఈమెకు సంబంధించిన మహేష్ ఓ శుభకార్యాన్ని తన ఇంట్లో నిర్వహించబోతున్నారు. అది కూడా తల్లి కోరిక మీద. అదేదో కాదు. ఓణీల ఫంక్షన్.
మహేష్ తల్లి ఇందిరా దేవి..సితార ఓణీల ఫంక్షన్‌ను చూడాలని కోరుకుంది. అయితే వయసురీత్యా అనారోగ్య కారణాలతో ఆమె కన్నుమూసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడా ఫంక్షన్‌ను మహేష్ ఘనంగా చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు సినీ సర్కిల్స్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నెలలోనే ఆ వేడుకను మహేష్ చేయాలనుకుంటున్నారని మహేష్ కుటుంబ సభ్యులతో పాటు సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు సైతం ఈ ఫంక్షన్‌కు భారీగానే విచ్చేస్తారంటూ వార్తలు వినిపిస్తున్నాయి.
ఇక సినిమాల విషయానికి వస్తే మహేష్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతోన్న లేటెస్ట్ మూవీ గుంటూరు కారం. రానున్న సంక్రాంతి సందర్భంగా జనవరి 12న రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఇందులో మహేష్ సిక్స్ ప్యాక్ లుక్‌తో కనిపించబోతున్నారు. తమన్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రాన్ని సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్నారు. పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా ఇప్పటి వరకు మహేష్‌ను ఎవరూ చూపించని మాస్ యాంగిల్లో త్రివిక్రమ్ చూపించబోతున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి.