English | Telugu

ఆంధ్రా వారితో దిల్ రాజు వియ్యం... జైపూర్‌‌లో పెళ్లి!

ఇప్పుడు సినీ ఇండ‌స్ట్రీలో పెళ్లి భాజాల‌కు స‌మ‌యం వ‌చ్చిన‌ట్లుంది. మెగా ఫ్యామిలీలో వ‌రుణ్ తేజ్‌, లావ‌ణ్య త్రిపాఠిలు ఇట‌లీలో పెళ్లి చేసుకోనున్నారు. మ‌రో వైపు హీరో వెంక‌టేష్ రెండో కుమార్తె వివాహం కూడా జ‌ర‌గ‌నుంది. రీసెంట్‌గానే నిశ్చితార్థం కూడా జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. అలాగే ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు ఎం.ఎం.కీర‌వాణి రెండో త‌న‌యుడు, హీరో శ్రీసింహ, ముర‌ళీ మోహ‌న్ మ‌న‌వరాలితో పెళ్లి పీట‌లెక్క‌నున్నారు. ఈ క్ర‌మంలో తెలుగు చిత్రీసీమ‌కు చెందిన మ‌రో ప్ర‌ముఖ వ్య‌క్తి ఇంట్లో పెళ్లి భాజాలు మోగ‌నున్నాయి. ఆ వ్య‌క్తి ఎవ‌రో కాదు.. దిల్ రాజు. ఈ అగ్ర నిర్మాత సోద‌రుడు, శిరీష్ త‌న‌యుడు ఆశిష్ రెడ్డి త్వ‌ర‌లోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు.

తెలంగాణ ప్రాంతానికి చెందిన దిల్‌రాజు ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఓ ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త‌తో వియ్య‌మందుతున్నట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. డిసెంబ‌ర్ నెల‌లో నిశ్చితార్థం జ‌ర‌గ‌నుంది. ఫిబ్ర‌వ‌రిలో పెళ్లి జ‌ర‌నుంది. మ్యారేజ్‌ను జైపూర్‌లో ఘ‌నంగా నిర్వ‌హించాల‌ని అనుంటున్నారు. నిజానికి ఆశిష్ పెళ్లి గురించి ఆగ‌స్ట్ నుంచి వార్త‌లు వినిపించాయి. రెండు కుటుంబాల‌కు చెందిన పెద్ద‌లు క‌లిసి మాట్లాడుకున్నారు. దిల్ రాజు త‌ర‌పున సుకుమార్ సైతం ఆశిష్ పెళ్లి పెద్ద‌గా మాటా మంతీ కార్య‌క్ర‌మాల్లో పాల్గొన్న‌ట్లు న్యూస్ వినిపించింది.

సినీ నిర్మాణ వ్య‌వ‌హారాల్లో చురుకుగా వ్య‌వ‌హ‌రిస్తూ వ‌చ్చిన ఆశిష్ రెడ్డి గ‌త ఏడాది విడుద‌లైన రౌడీ బాయ్స్ చిత్రంతో హీరోగా మారారు. దానికి శ్రీహ‌ర్ష ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ హీరోయిన్‌గా న‌టించింది. ఇప్పుడు సుకుమార్ శిష్యుడు విశాల్ కాశీ ద‌ర్శ‌క‌త్వంలో సెల్ఫిష్ అనే సినిమా చేస్తున్నారు. త‌మ హోం బ్యాన‌ర్ అయిన శ్రీవెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్‌తో పాటు సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్ కూడా ఈ మూవీ నిర్మాణంలో భాగ‌స్వామిగా వ్య‌వ‌హ‌రిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఈ సినిమా నిర్మాణ ద‌శ‌లో ఉంది.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .