English | Telugu

రష్మీకి గుడ్ న్యూస్ చెప్పిన రాంప్రసాద్

బుల్లితెర మీద జబర్దస్త్ ఎంత పోపులరో ఆ షోలో రష్మీ, సుధీర్ జోడి అంతకంటే పాపులర్. ఐతే ఇప్పుడు వీళ్లకు సంబంధించి ఒక న్యూస్ ట్రెండ్ అవుతోంది. ఆషాడంలో అమ్మ కాబోతోంది రష్మీ అంటూ నాడీ పట్టుకుని జోస్యం చెప్పాడు ఆటో రాంప్రసాద్. ఆ మాటకు ఒక్కసారిగా షాక్ ఐన రష్మీ నువ్వు డాక్టర్ వా అంటూ అని అన్నందుకు ఇంత బ్లాస్టింగ్ న్యూస్ చెప్పి బాంబు పేలుస్తావా అంది రష్మీ గౌతమ్. రష్మీకి, సుధీర్ కి ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది ఆడియన్స్ లో. హీరో హీరోయిన్స్ కి ఏమాత్రం తక్కువ కాకుండా ఉంటుంది ఈ జోడి. వీళ్లిద్దరి లవ్ ట్రాక్ సోషల్ మీడియాలో ఎప్పుడూ హాట్ టాపిక్కే. ఏ ఇష్యూ జరిగినా దాన్ని ఈ జోడికి ఆపాదించి ఫన్ క్రియేట్ చేసి రేటింగ్స్ పెంచుకోవడం చూస్తూనే ఉన్నాం. ఆడియన్స్ కూడా మెంటల్ గా వీళ్ళిద్దరూ లవర్స్ అని ఫిక్స్ ఇపోయారు కూడా. 

ఇంకెంతమంది వస్తున్నారో ఆ షో నుంచి ఈ ఇంట్లోకి

బిగ్ బాస్ గురించి చెప్పాలంటే ఆడియన్స్ లో ఒక క్రేజ్ సంపాందించుకున్న షో. ఇప్పుడు బిగ్ బాస్ 5 సీజన్స్ పూర్తి చేసుకుని 6 వ సీజన్ లోకి అడుగుపెట్టబోతోంది. దీని కోసం నిర్వాహకులు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఇక ఈ సీజన్ లో పార్టిసిపేట్ చేసే కంటెస్టెంట్స్ వీళ్ళే అంటూ కొంతమంది పేర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బుల్లితెర మీద బిగ్గెస్ట్ రియాలిటీ సక్సెస్ షోగా మంచి గుర్తింపు తెచ్చుకుంది బిగ్ బాస్. ఈ షోలో ఇచ్చే టాస్కులు, నామినేషన్లు, ఎలిమినేషన్లు మంచి ఆసక్తికరంగా ఉంటాయి. ఓటిటి వేదిక మీద ప్రసారమవుతున్న ఈ షో ఇక్కడ కూడా సక్సెస్ ని అందుకుంది.