జూలై 11 నుండి ముక్కుపుడక
'దేవతలారా దీవించండి', 'కోడళ్ళు మీకు జోహార్లు' వంటి సరికొత్త సీరియల్స్ తో ప్రేక్షకులకు రెట్టింపు వినోదాన్ని పంచుతున్న 'జీ తెలుగు', ఇప్పుడు 'ముక్కుపుడక' అనే మరో సీరియల్ తో తెలుగు ప్రజల ముందుకు రానుంది. ఒక సాంప్రదాయక కుటుంబ నేపథ్యంలో వస్తున్న ఈ సీరియల్ జూలై 11 నుండి ప్రతి సోమవారం నుండి శనివారం రాత్రి 8 గంటలకు ప్రసారం కానుంది. సాధారణంగా అత్తాకోడళ్ల ఆధిపత్యపోరాటం నేపథ్యంలో వచ్చే సీరియల్స్ కన్నా, 'ముక్కుపుడక' కాస్త భిన్నంగా ఉండబోతుంది. ఇక వివరాల్లోకి వెళితే, వేదవతి అనే ఒక స్త్రీ తనకు వారసురాలిగా అన్నపూర్ణ దేవి యొక్క ముక్కుపుడకని ధరించి, అమ్మవారిని కొలిచి, తన ఊరిని ఆ దేవి ఆగ్రహం నుండి కాపాడే ఒక అమ్మాయిని కోడలిగా తెచ్చుకోవాలనుకుంటుంది.