English | Telugu
దూకుడు పెంచిన బిగ్ బాస్ స్టార్ షణ్ముఖ్!
Updated : Jul 12, 2022
'ది సాఫ్ట్‌వేర్ డెవలపర్', 'సూర్య' వంటి యూట్యూబ్ సిరీస్ లతో ఆకట్టుకుని పాపులర్ అయిన యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జస్వంత్. కొత్త కొత్త వీడియోలతో, షార్ట్ ఫిలిమ్స్‌తో తనకంటూ ప్రత్యేకతని చాటుకున్నాడు. మిలియన్ ల కొద్దీ సబ్‌స్క్రైబర్స్‌ని సొంతం చేసుకున్న జస్వంత్ ఈ క్రేజ్ తో రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే సిరి కారణంగా, తనతో చేసిన అతి వల్ల షణ్ముఖ్ విన్నర్ కాలేక రన్నరప్ గా మిగిలిపోయాడు. ఇదే సిరి కారణంగా తను ఎంతో కాలంగా ప్రేమిస్తున్న దీప్తి సునయనతో బ్రేకప్ అవ్వాల్సి వచ్చింది.
అప్పటి నుంచి తీవ్ర నిరాశలో వున్న షణ్ముఖ్ మొత్తానికి దూకుడు పెంచాడు. మళ్లీ మునుపటి జోష్ తో రంగంలోకి దిగాడు. ఏకంగా వెబ్ సిరీస్‌తో ఓటీటీ వరల్డ్ లోకి ప్రవేశిస్తున్నాడు. షణ్ముఖ్ నటించిన లేటెస్ట్ వెబ్ సిరీస్ `ఏజెంట్ ఆనంద్ సంతోష్`. ఈ వెబ్ సిరీస్ ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది. మొత్తం 10 ఎపిసోడ్‌లుగా ఈ సిరీస్‌ని నిర్మించారు. ఆహాలో వీక్లీ వన్స్ ఓ ఎపిసోడ్ స్ట్రీమింగ్ కానుంది. ఈ వెబ్ సిరీస్ టీజర్ ని దర్శకుడు అనిల్ రావిపూడి విడుదల చేశారు. సరికొత్త థాట్స్ తో ఈ సిరీస్ ఆసక్తికరంగా వుంది.
"ఇంతకీ నువ్ ఏం చేస్తుంటావ్? నెలకి నీ జీతం ఎంత వస్తుంది? అసలు ఎంత ఖర్చవుతుంది? ఎంత మిగులుతుంది?".. అంటూ షణ్ముఖ్ ను ప్రశ్నలు అడగడంతో టీజర్ ప్రారంభం అవుతుంది. "నేను ఒక డిటెక్టివ్ ఏజెంట్ ను సర్" అని షణ్ముఖ్ ఇచ్చే సమాధానం, బ్యాగ్రౌండ్ మ్యూజిక్‌తో వెబ్ సిరీస్ పై ఆసక్తిని రేకెత్తిస్తున్నారు. ఇందులో షణ్ణు చాలా స్టైలిష్ గా కనిపించాడు. "మనసు తప్ప ఫిజికల్ గా, లిక్విడ్ గా ఏదైనా వెదికి పెడతా" అని అతను చెప్పే డైలాగ్ తన ఫ్యాన్స్ తో పాటు అందరిని ఆకట్టుకునేలా వుంది. ఈ సిరీస్ కు అరుణ్ పవార్ దర్శకత్వం వహించగా, సుబ్బు స్క్రిప్ట్ అందించాడు.