English | Telugu
'గుప్పెడంత మనసు' రిషి ఇన్‌స్టా హ్యాండిల్ హాక్!
Updated : Jul 13, 2022
'గుప్పెడంత మనసు' సీరియల్ ఈమధ్య మంచి రేటింగ్ తెచ్చుకుని అన్ని సీరియల్స్ తో పోటీ పడుతూ ముందు వరసలో నిలుస్తోంది. ఇది ఒక క్యూట్ లవ్ స్టోరీగా ఇప్పుడు యూత్ ని ఎక్కువగా అట్ట్రాక్ట్ చేస్తున్న సీరియల్. ఇందులో వసుధారగా రక్షా గౌడ, రిషిగా ముఖేష్ గౌడ, మహేంద్రగా సాయికిరణ్, విలన్ రోల్ సాక్షిగా రసజ్ఞ ఇలా మంచి మంచి క్యారెక్టర్స్ తో ఈ సీరియల్ నడుస్తోంది. ఐతే ఇప్పుడు ఈ సీరియల్ 500 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. దీనికి గాను టీం మొత్తం కూడా కేక్ కట్ చేసుకుని సందడి చేసుకుంది.
ఐతే ఒక మంచి వెనకాల చెడు ఉంటుంది.ఇటీవల ఫేమస్ పర్సన్స్ అకౌంట్స్ అన్నీ కూడా హాక్ అవుతున్నాయి. అలాంటి సిట్యువేషన్ ఇప్పుడు రిషికి ఎదురయ్యింది. రిషి అలియాస్ ముఖేష్ గౌడ అనుక్షణం కష్టపడుతూ ఈ సీరియల్ లో తన నటనతో ఒక మంచి క్రేజ్ ని తెచ్చుకున్నాడు. దీనికి గాను ఎంతో మంది ఫాలోయర్స్ పెరిగారు, అభిమానులు కూడా పెరిగారు, తనకంటూ ఒక సక్సెస్ ని తెచ్చుకున్నాడు.
ఇలాంటి సంతోషకర సమయంలో రిషి ఇన్స్టాగ్రామ్ హేండిల్ ని ఎవరో హాక్ చేసేసారు. ఈ ఇన్సిడెంట్ తో టీం మొత్తం లైన్ లోకి వచ్చి రిషికి అండగా నిలబడింది. "కొంచెం ఆలోచించండి. అతని ఇన్స్టా హేండిల్ అతనికి తిరిగి ఇచ్చేయండి" అంటూ టీం మొత్తం కూడా ఈ విధంగా ముఖేష్ గౌడ గురించి తమ స్టోరీ స్టేటస్ లో పోస్ట్ చేసుకున్నారు.