English | Telugu
మేం కలిసిపోయాం.. ఒక కారు కూడా కొనుక్కున్నాం!
Updated : Jul 12, 2022
సిరి హన్మంత్.. ఈ పేరు అందరికీ పరిచయమే. బిగ్ బాస్ బ్యూటీగా కూడా పేరు తెచ్చుకుంది. బిగ్ బాస్ హౌస్ లో సిరి వేసుకున్న డ్రెస్సుల దగ్గర నుంచి షన్నుతో రెచ్చిపోయి మరీ చేసిన రొమాన్స్ వరకు కూడా ఆడియన్స్ కి అన్ని విషయాలు తెలుసు. ఎప్పుడూఏదో ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేస్తూనే ఉంటుంది సిరి. బిగ్ బాస్ హౌస్ లో ఆమె షన్నుతో చేసిన ముద్దుల వ్యవహారం పై చాలా రూమర్స్ వచ్చాయి. సోషల్ మీడియాలో ఫుల్ ట్రోల్ కూడా అయ్యాయి.
షన్ను లేకపోతే బతకలేను అన్నట్టుగా ఒక సీన్ ని బాగా క్రియేట్ చేసి పండించేసింది. దాంతో ఆల్రెడీ అప్పటికే దీప్తితో ప్రేమలో ఉన్న షన్ను కొంత కన్ఫ్యూజన్‌కు గురయ్యాడు. మరో పక్క దీప్తి ఇవన్నీ చూసి షణ్ముఖ్ తో లవ్ బ్రేకప్ చెప్పేసింది. అలాగే సిరి హన్మంత్‌కు ఆమె లవర్ శ్రీహాన్ కూడా బ్రేకప్ చెప్పాడు. అదే టైంలో వీళ్లందరి మధ్య గొడవలు కూడా తారాస్థాయికి వెళ్లాయి.
ఏమయ్యిందో ఏమో కానీ ఇటీవల ఒక విషయం గమనిస్తే షన్ను, దీపు కలవలేదు కానీ శ్రీహాన్, సిరి హన్మంత్ మాత్రం కలిసిపోయి చెట్టాపట్టాలేసుకుని తెగ తిరిగేస్తున్నారు. ఇద్దరి మధ్య అసలేం జరగనట్టే కనిపిస్తున్నారు.. దీనికి సంబంధించి ఒక పోస్ట్ ని వాళ్ళ ఇన్స్టాగ్రామ్ స్టోరీ స్టేటస్ లో పెట్టేసుకున్నారు. ఇక ఇద్దరూ కలిసి పండగ చేసుకోవడమే కాకుండా ఒక కాస్ట్లీ కారు కూడా కొనేసుకున్నారు. "కారు కొంటే కొన్నావ్ కానీ డ్రైవింగ్ నేర్చుకో ముందు" అంటూ పోస్ట్ పెట్టాడు శ్రీహాన్.
ఇకపోతే బిగ్ బాస్ సీజన్ 6 కి శ్రీహాన్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్టుగా టాక్ వినిపిస్తోంది. అదే నిజమైతే అక్కడ శ్రీహాన్ ఎంత బాగా గేమ్ ప్లే చేస్తాడో చూడాల్సిందే.. వీళ్ళిద్దరూ కలిసిపోయారు.. అక్కడ దీప్తి, షన్ను ఎప్పటికీ కలుస్తారో వాళ్ళకే తెలియాలి.