English | Telugu

ఇంకెంతమంది వస్తున్నారో ఆ షో నుంచి ఈ ఇంట్లోకి

బిగ్ బాస్ గురించి చెప్పాలంటే ఆడియన్స్ లో ఒక క్రేజ్ సంపాందించుకున్న షో. ఇప్పుడు బిగ్ బాస్ 5 సీజన్స్ పూర్తి చేసుకుని 6 వ సీజన్ లోకి అడుగుపెట్టబోతోంది. దీని కోసం నిర్వాహకులు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఇక ఈ సీజన్ లో పార్టిసిపేట్ చేసే కంటెస్టెంట్స్ వీళ్ళే అంటూ కొంతమంది పేర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బుల్లితెర మీద బిగ్గెస్ట్ రియాలిటీ సక్సెస్ షోగా మంచి గుర్తింపు తెచ్చుకుంది బిగ్ బాస్. ఈ షోలో ఇచ్చే టాస్కులు, నామినేషన్లు, ఎలిమినేషన్లు మంచి ఆసక్తికరంగా ఉంటాయి. ఓటిటి వేదిక మీద ప్రసారమవుతున్న ఈ షో ఇక్కడ కూడా సక్సెస్ ని అందుకుంది.

ఇక ఇప్పుడు ఈ షోలోకి ఎంట్రీ కోసం కొంతమందిని సంప్రదిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే జబర్దస్త్ షోతో మస్త్ పాపులర్ ఐన కొందరిని తీసుకురాబోతున్నట్టు తెలుస్తోంది. జబర్దస్త్ వర్ష, హైపర్ ఆది కంటెస్టెంట్స్ గా రాబోతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు లేటెస్ట్ గా ఆటో రాంప్రసాద్ పేరు కూడా తెరపైకి వచ్చింది. బిగ్ బాస్ యాజమాన్యం రాంప్రసాద్ తో చర్చలు చేస్తున్నట్టుగా టాక్ నడుస్తోంది. ఐతే ఈ హౌస్ లోకి రావాలంటే రెమ్యూనరేషన్ ని దండిగా ముట్టజెపుతామని కూడా ఆఫర్ ఇచ్చారట.

ఒకవేళ హౌస్ లోకి వెళ్లాల్సి వస్తే ఇక్కడ షోస్ కి ఎలాంటి ఇబ్బంది రాకుండా డేట్స్ అడ్జస్ట్ చేసుకోవాలా వద్దా అనే ప్లాన్ లో వున్నాడట రాంప్రసాద్. ఇకపోతే గత ఎపిసోడ్స్ కంటే భిన్నంగా అంతకు మించి అన్నట్టుగా ఉండేలా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ బిగ్ బాస్ సీజన్ 6 అనేది సెప్టెంబర్ నుంచి ప్రసారం కాబోతున్నట్టు సమాచారం. ఇక జబర్దస్త్ నుంచి వీళ్లేనా ఇంకా ఎవరైనా వస్తున్నారా అనే విషయం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.