యష్ - వేదలకు మాళవిక వార్నింగ్!
బుల్లితెరపై ప్రసారం అవుతున్న సీరియల్ `ఎన్నెన్నో జన్మల బంధం`. గత కొన్ని వారాలుగా మహిళా ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటూ విజయవంతంగా సాగుతోంది. నిరంజన్, డెబ్జాని మోడక్ జంటగా నటించారు. కాంచన, మాలినిల ద్వారా వేద ఇంటి నుంచి వెళ్లిపోయిందని, ఇక రాదని తెలుసుకున్న ఖుషీ వెంటనే వెళ్లి వేదని ఇంటికి రమ్మంటుంది. నేను, నువ్వు, డాడీ మనం ముగ్గురం ఒక పార్టీ కదా ఎందుకు మమ్మల్ని వదిలేసి ఇక్కడికి వచ్చావ్? అంటూ నిలదీస్తుంది.