English | Telugu
కైలాష్ నీచుడని తెలుసుకున్న యష్!
Updated : Jul 12, 2022
కొంత కాలంగా స్టార్ మాలో ప్రసారం అవుతున్న రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ `ఎన్నెన్నో జన్మల బంధం` చిత్ర విచిత్రమైన ట్విస్ట్ లు, మలుపులతో ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతూ మహిళా ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. నిరంజన్, డెబ్జాని మోడక్ జంటగా నటిస్తున్నారు. బెంగళూరు పద్మ, జిడిగుంట శ్రీధర్, ప్రణయ్ హనుమండ్ల, బేబీ మిన్ను నైనిక, సుమిత్ర, ఆనంద్, రాజా శ్రీధర్ తదితరులు ఇతర కీలక పాత్రధారులు. మంగళవారం ఎపిసోడ్ ఎలా సాగనుందో చూద్దాం.
తమ ఇద్దరి మధ్య ఏర్పడిన మనస్పర్థల వల్ల ఖుషీ ఇబ్బందిపడుతోందని తల్లి సులోచనతో చెబుతూ వేద బాధపడుతూ వుంటుంది. అయితే "నీ మంచితనమే నీకు శ్రీరామరక్ష" అని వేదకు తల్లి ధైర్యం చెబుతుంది. కట్ చేస్తే బయట పార్కింగ్ ప్లేస్ లో కూర్చుని వేద ఆలోచిస్తూ వుంటుంది. అదే సమయంలో కైలాష్.. వేద దగ్గరికి వెళ్లి భయపెట్టే ప్రయత్నం చేస్తాడు. వేద భయపడుతుంది. వెంటనే "నా గురించి ఇంట్లోవాళ్లకి చెప్పాలని ప్రయత్నించావు కానీ నీ మాట ఎవ్వరూ నమ్మలేదు. నీ భర్త కూడా నీ మాటని వినలేదు. దీన్ని బట్టి నీకు ఏం అర్థమైంది. ఇంట్లో నీకంటే నా బలమే ఎక్కువని. ఆ దేవుడు నన్ను నీకోసమే పుట్టించాడు" అంటూ వేదని వేధిస్తుంటాడు.
దీంతో వేద "చెప్పుతీసుకుని కొడతాను వెధవ" అని మండిపడుతుంది. "ఆడది అంటే ఓపిక.. ఆ ఓపిక వదిలేసిందంటే ఈ ప్రపంచం తలకిందులవుతుంది. వేద రూపంలో నీకు చావుమూడింది" అంటూ వార్నింగ్ ఇస్తుంది.. కైలాష్.. వేదని వేధిస్తున్న తీరుని చూసిన యష్.. 'వీడు ఇంత నీచుడని తెలియక అంతా వేదని అపార్థం చేసుకున్నారు' అని ఫీలవుతుంటాడు. వెనక్కి తిరిగి యష్ ని చూసిన కైలాష్ ప్లేట్ మార్చి వేదని ఇంటికి రమ్మని బ్రతిమాలుతున్నానని కవర్ చేస్తాడు. కట్ చేస్తే అభిమన్యు.. యష్ ని వేధించడం మొదలు పెడతాడు. "వేద నిన్ను వదిలేసిందంట కదా?" అంటూ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తాడు. ఆ తరువాత ఏం జరిగింది? అన్నది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.