English | Telugu

జ‌న‌సేనానితో క‌లిసి పాలిటిక్స్‌లోకి ఆది ఎంట్రీ!?

జనసేనాని పవన్ కళ్యాణ్ గురించి, జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది గురించి స్పెషల్ గా ఏమీ చెప్పుకోనవసరం లేదు. పవన్ సినిమాలు, రాజకీయాలు బాలన్స్ చేస్తూ ఉంటే ఆది కూడా షోస్ ని, మూవీస్ ని బాలన్స్ చేసుకుంటూ ఉంటాడు. ఆది పంచ్ డైలాగ్స్ కి ఫేమస్ ఐతే, పవన్ ట్రెండ్ సెట్ చేయడంలో ఫేమస్. ఐతే జనసేనాని మీద ఆది చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.

పీకేకి ఆది వీరాభిమాని అని ఆడియన్స్ కి బాగా తెలుసు. ఐతే తాజాగా ఆది ఒక ఇంటర్వ్యూ లో పవన్ కళ్యాణ్ తో పాటు తానూ కూడా రాజకీయ అరంగేట్రం చేస్తున్నట్టు చెప్పుకొచ్చాడు. ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ లాంటి మంచి మనిషిని తానింత వరకు చూడలేదన్నాడు. ఐతే క్రిష్ డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న 'హరిహర వీరమల్లు' మూవీ కోసం ఆయన్ని ఇంటికి వెళ్లి మరీ కలిసినట్లు చెప్పుకొచ్చాడు.

అసలు పవన్ కళ్యాణ్ కి డబ్బు విషయం పెద్ద లెక్క కాదు, అలా అని అంత వ్యామోహం కూడా లేదంటూ కితాబిచ్చాడు. ఆయన సినిమాల్లో నటిస్తూ ఆ వచ్చిన రెమ్యూనరేషన్ ని పార్టీ కోసం, కార్యకర్తల కోసం అలాగే రైతుల కోసం వినియోగించడం అభినందనీయం అన్నాడు. తన కోసం తన వాళ్ళ కోసం కాకుండా సమాజం కోసం ఏదో చేయాలనే తపనతో ఎప్పుడూ ఉంటాడు కాబట్టే తనకు పవన్ కళ్యాణ్ అంటే ఇష్టమని చెప్పుకొచ్చాడు. ఇక రాబోయే ఎన్నికల్లో జనసేన తరపున పోటీ చేసే విషయంపై సరైన క్లారిటీ ఇవ్వకుండా సమాధానం దాటవేసాడు. ఏదేమైనా నిప్పు లేకుండా పొగ రాదు కాబట్టి ఆల్రెడీ ఒక మాటేసి ఉంచేసాడు. ఈ మాట ప్రకారం ఇన్ ఫ్యూచర్ పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.